YS Sunitha: సెఫ్టిక్ అయితే ప్రాణాలకే ప్రమాదం జగన్.. సునీత పంచ్ లు మామూలుగా లేవుగా!

YS Sunitha: జగన్ కి జరిగిన రాయి దాడి నేపథ్యం లో ఆయన చెల్లెలు ఆయన సునీత ఆయనని ఒక ఆట ఆడుకుంటున్నారు. వైయస్ వివేక హత్య విషయంలో సునీత జగన్ మీద కోపంతో రగిలిపోతున్నారు. ఆమెకి తోడుగా నిలిచారు వైయస్ షర్మిల. ఇద్దరూ జగన్ అని విమర్శించే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ మధ్య పులివెందులలో సభలో షర్మిల సునీత ఇద్దరూ జగన్ మీద ఎలా విడుచుకుపడ్డారో అందరికీ తెలిసిందే.

జగన్ వ్యాఖ్యలు వివేకాపై విద్వేషం కనిపిస్తుందని, ఏం పాపం చేశారని ఆయనపై మీకు ఇంత కోపం అని నిలదీశారు సునీత. అలాగే పదేపదే అవినాష్ ను జగన్ చిన్నపిల్లడిగా సంబోధించటాన్ని సునీత తప్పుపట్టారు. చిన్న పిల్లలకు ఎంపీ పదవులు ఇస్తారా అంటూ జగన్ ని నిలదీశారు. అలాగే జగన్ కు న్యాయవ్యవస్థ మీద సిబిఐ మీద నమ్మకం లేదు మరి ఏ వ్యవస్థపై నమ్మకం ఉందో ఆయనే చెప్పాలి అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

అదే సమయంలో సునీత జగన్ కి జరిగిన గాయం గురించి మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్ కి గాయం కావడం దురదృష్టకరం. ఇలాంటి గాయాలు అయినప్పుడు కట్లు కట్టడం మంచిది కాదని, దానివల్ల సెప్టిక్ అయ్యి గాయం ఇంకా పెద్దది అవుతుంది. ఆయనకి వైద్య పరంగా ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారు, గాయాన్ని గాలికి వదిలేస్తేనే త్వరగా మానుతుందని, ఇది ఒక డాక్టర్ గా తాను చెప్తున్నానని జగన్ ఇప్పటికైనా బ్యాండేజ్ తీసేస్తే మంచిదని ఆమె చెప్తున్నారు.

ఆమె మాటల్లో కూడా నిజంలేకపోలేదు. జగన్ కి తగిన గాయం ఎలాంటిదో మనందరికీ తెలిసిందే అయితే ఆ మాత్రం గాయానికే గాయం అయిన దగ్గర నుంచి బ్యాండేజ్ తోనే కనిపిస్తున్నారు జగన్. ఎన్నికలయ్యే వరకు కూడా ఈ బ్యాండేజ్ తీయకపోవచ్చు అని సోషల్ మీడియాలో జగన్ పై పంచ్ ల వర్షం కురిపిస్తున్నారు శత్రువర్గం వారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -