Asian Games 2023 Winners: సెక్యూరిటీ గార్డ్, ఛాయ్ వాలా కూతుళ్లు దేశానికే కీర్తి తెచ్చిన తెలుగు అమ్మాయిలు.. గ్రేట్ అంటూ?

Asian Games 2023 Winners: తెలంగాణ క్రీడ చరిత్రలో నవ శకానికి నాంది పడుకుతూ ఆసియా క్రీడల్లో గురుకుల అథ్లెట్ అగసర నందిని కంచు మోత మోగించింది. కాళ్లకు చెప్పులు కూడా లేని కటిక పేదరికం అనుభవించిన ఈ అమ్మాయి నేడు ఏషియన్ గేమ్స్ లో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. అథ్లెటిక్స్ లోనే అత్యంత కష్టమైన హెప్టాథ్లాన్ ఫైనల్లో 5712 పాయింట్లతో నిలిచింది. తద్వారా తెలంగాణ నుంచి అథ్లెటిక్స్ లో పథకం గెలిచి దేశ రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసింది.

నందిని ప్రస్తుతం సంగారెడ్డి గురుకుల కళాశాలలో బి బి ఏ రెండో ఏడాది చదువుతుంది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అథ్లెటిక్స్ అకాడమీ మొదటి బ్యాచ్ విద్యార్థిని కావటం విశేషం. ఈమె తండ్రి ఎల్లయ్య చాయ్ అమ్ముతూ కూతురిని గురుకుల పాఠశాలలో చేర్పించారు. నందిని ఆసియా క్రీడల్లో కాంస్య పథకం సంపాదించడం పట్ల పలువురు నేతలు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే భారతదేశానికి మరొక పథకాన్ని తీసుకు వచ్చిన జ్యోతి ఎర్రాజి ఏపీలోని విశాఖపట్నం కి చెందిన తెలుగమ్మాయి.

ఈమె వంద మీటర్ల హార్దిల్స్ లో రజిత పథకం గెలుచుకున్నారు. ఈమె తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డ్ తల్లి కుమారి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్లీపింగ్ సెక్షన్లో పని చేస్తున్నారు. ఈ ఆటలో జ్యోతి తన ప్రతిభతో పాటు తెలివితేటలని కూడా ప్రదర్శించాల్సి వచ్చింది. లేదంటే ఆమె చైనా కుయుక్తులకు బలైపోయి ఉండేది. ఇంతకీ ఏం జరిగిందంటే అథ్లెట్లు అందరూ రేస్ కోసం తమ మార్కులో ఉండగా గన్ షాట్ కి ముందే చైనా రేసర్ యానీవు పరుగు ప్రారంభించింది. ఆమెను చూసి పక్కనే ఉన్న జ్యోతి కూడా పరుగు ప్రారంభించింది. దీనిని అథ్లెటిక్స్ లో ఫాల్స్ స్టార్ట్ అంటారు. ఇలా చేయడం వల్ల సదరు అథ్లెట్లను రేసు నుంచి తప్పిస్తారు.

అయితే ఎవరు మొదట ఫాల్స్ రన్ చేశారో ఆ అథ్లెట్ ను మాత్రమే రేసు నుంచి తప్పించాలి. కానీ చైనా అధికారులు కుయుక్తితో సెకండ్ రేసర్ ని కూడా అనర్హురాలుగా ప్రకటించారు. అయితే ఇద్దరూ అథ్లెట్లు నిరసనకు దిగారు. ఆ సమయంలో అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలోని అథ్లెట్ కమిషన్ హెడ్, వెటరన్ లాంగ్ జంపర్ అంజు బాబి జార్జ్ కూడా అక్కడే ఉన్నారు. జ్యోతి కి మద్దతుగా మాట్లాడారు దీంతో మ్యాచ్ నిర్వాహకులు రీప్లేలు చూసి యానీవు మొదట పరుగు ప్రారంభించినట్లు తెలిపారు. జ్యోతి ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారించి రేసులో మూడో స్థానంలో నిలిచిన ఆమెకు రజిత పథకాన్ని అందజేశారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -