Palamaner: అన్న కుమార్తెపై లైంగిక దాడి.. గర్భవతి అని తెలియడంతో?

Palamaner: రోజు రోజుకి ఆడవారిపై జరుగుతున్న ఆకృత్యాలు అఘాయిత్యాలు, హత్యల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. 9 నెలల చిన్నారి నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ఏ ఒక్కరినే విడిచిపెట్టడం లేదు కామాంధులు. ఆడది కనిపించింది అంటే చాలు మృగాలుగా మారి వారిపై అత్యాచారం అంతటితో ఆగకుండావారిని హత్య చేయడానికి కూడా వెనుకడం లేదు.. దేశవ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యలో ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తల్లి,చెల్లి,అక్క, కూతురు అన్న వావివరసలు మరిచి దారుణాలకు ఒడిగడుతున్నారు.

ఒక దుర్మార్గుడు పెళ్ళాం గర్భవతి అని సొంత అన్న కూతురిపైన అత్యాచారానికి పాల్పడ్డాడు. మరి చివరికి ఏం జరిగింది అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ ఘోరం చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో వెలుగు చూసింది. నాగరాజు అనే వ్యక్తి భార్య పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. అతని భార్య మళ్లీ గర్భం దాల్చడంతో అతని కామం తీర్చుకునేందుకు వేరే మార్గం కోసం వెతికాడు. అయితే అతని కన్ను అన్న కుమార్తె పై పడింది. ఆమెను రోజూ స్కూలుకు తీసుకెళ్లడం, ఇంటికి తీసుకురావడం చేస్తున్నాడు. వచ్చే దారిలో అమ్మాయికి తినుబండారాలు కొనిపించడం చేయసాగాడు.

 

ఒక రోజు ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని ఆమ్మాయిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమె తల్లిదండ్రులను చంపేస్తానంటూ బెదిరించాడు. బాబాయ్ నిజంగానే అమ్మానాన్నను చంపేస్తాడేమో అని ఆమె మౌనంగా ఉంది. ఆమె చేసిన పెద్ద తప్పు అదే అయ్యింది. ఎందుకంటే అదే అదునుగా భావించిన నాగరాజు ఆ అమ్మాయిపై తరచూ లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే సమయంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లడం ఆమెపై తన కామం తీర్చుకోవడం చేశాడు. అయితే కొన్నాళ్లకు ఆ బాలిక గర్భం దాల్చింది. ఆ విషయాన్ని కూడా ఎవరికీ చెప్పకూడదని బెదిరించాడు. అలా చెబితే చంపేస్తానన్నాడు. భయంతో అమ్మాయి ఎవరికీ చెప్పుకోకుండా అలాగే ఉండిపోయింది. అయితే ఆమె శరీరంలో మార్పులు గమనించిన తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు అమ్మాయికి పరీక్షలు నిర్వహించారు. తర్వాత అమ్మాయి 8 నెలల గర్భవతి వైద్యులు స్పష్టం చేశారు. వైద్యుల మాటలు విన్న ఆ బాలిక తల్లి ఒక్కసారి షాక్ అయింది. ఆ విషయం పై బాలికను నిలదీయగా అసలు విషయం చెప్పింది. వెంటనే నాగరాజును పట్టుకుని అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గతంలో కూడా అతను గ్రామంలో ఉన్న పులువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని అతనిపై కేసులు కూడా ఉన్నాయంటూ చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -