Bone Fractures: విరిగిన ఎముకలను ఈ వైద్యుడు క్షణాల్లో అతికిస్తాడట.. ఇతని టాలెంట్ కు ఫిదా అవ్వాల్సిందే!

Bone Fractures: ప్రస్తుత కాలంలో ఏదైనా చిన్న దెబ్బ తగిలితే వెంటనే హాస్పిటల్ కి పరుగులు పెడుతూ ఉంటారు. ఇలా హాస్పిటల్స్ కి వెళ్లి వేలుకు వేలు ఫీజులు కడుతూ ఎక్స్ రేలు స్కానింగ్ లు టెస్ట్ లు అంటూ బోలెడు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక పొరపాటున మనం జారిపడిన ఎముకలు విరిగితే మాత్రం కచ్చితంగా సర్జరీ చేయాల్సిన పరిస్థితిలు ఏర్పడుతుంటాయి. అయితే ఎముకలు విరిగిన ఆపరేషన్ లేకుండా క్షణాల్లో అతికిస్తారట.

చావలి గ్రామం వేమూరు మండలం గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఓ వ్యక్తి కేవలం ఆయుర్వేద మూలికల ద్వారా ఎలాంటి విరిగిన ఎముకలనైనా క్షణాల్లో కట్టుకట్టి అతికిస్తారు. ఇక దగ్గర ఏ విధమైనటువంటి ఎక్స్ట్రా ఫీజులు లేకుండా కేవలం 500 రూపాయల లోనే మనం విరిగిన ఎముకలను అతికించుకోవచ్చు. ఇక ఈయన విరిగిన ఎముకలను సరైన స్థితిలో సెట్ చేసి ఆ ఎముక అతుక్కోవడానికి నాలుగు రకాల ఆకులతో తయారు చేసిన మూలికలను ఆ భాగంపై వేసి కట్టు కడతారు.

ఇక వెదురు దబ్బలతో నెలరోజుల పాటు వారానికి ఒకసారి చొప్పున కట్టు మారుస్తుంటారు ఇలా చేయటం వల్ల ఎముక మొత్తం పూర్తిగా సెట్ అవుతుందని చెబుతున్నారు. అయితే ఈ కట్టు వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే కట్టు మాత్రం తడవకుండా జాగ్రత్త పడాలని ఇక దురదపెట్టే కూరగాయలు అనగా వంకాయలు చేపలు వంటి వాటిని తీసుకోకపోవడం మంచిదని తెలిపారు.

ఏ విధమైనటువంటి ఎక్స్ రేలు స్కానింగ్లు లేకుండా విరిగిన ఎముకను గుర్తించి వాటిని క్షణాలలో కట్టు కట్టి వాటిని అతికిస్తారు. ఇలా ఈ డాక్టర్ కు ఉన్నటువంటి ఈ టాలెంట్ చూస్తే చాలామంది ఆశ్చర్యపోయారు. ఇక అక్కడికి వచ్చినటువంటి వారు కూడా డాక్టర్ల దగ్గర వేల రూపాయలను ఖర్చు పెట్టుకుని తిరిగి ఇక్కడికి వచ్చి ఈ నాటు వైద్యం ద్వారా బాగు చేయించుకున్నామని తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: షర్మిల ఎఫెక్ట్ తో క్రిస్టియన్ ఓట్లు దూరం.. ఇక వైసీపీకి ప్రశాంతత కరువైనట్టేనా?

YS Sharmila: రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్త్రాన్ని ఆయుధంగా వాడుకుంటు ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు . అలాగే షర్మిల క్రిస్టియన్ కమ్యూనిటీ అనే పదాన్ని వాడుకుంటున్నారు. పదేపదే మన మతం అంటూ వైఎస్...
- Advertisement -
- Advertisement -