YS Sharmila: షర్మిల ఎఫెక్ట్ తో క్రిస్టియన్ ఓట్లు దూరం.. ఇక వైసీపీకి ప్రశాంతత కరువైనట్టేనా?

YS Sharmila: రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్త్రాన్ని ఆయుధంగా వాడుకుంటు ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు . అలాగే షర్మిల క్రిస్టియన్ కమ్యూనిటీ అనే పదాన్ని వాడుకుంటున్నారు. పదేపదే మన మతం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్రిస్టియానిటీని గుర్తు చేస్తున్నారు. గతసారి ఎన్నికలలో జగన్ విజయం సాధించినప్పుడు క్రిస్టియన్ ఓట్లు కూడా కీలకపాత్ర పోషించాయి. అప్పుడు క్రిస్టియన్ ఓటుని వైసీపీ వైపు తిప్పింది బ్రదర్ అనిల్ కుమార్. అయితే ఇప్పుడు వారి మధ్య వ్యవహారం చెడింది కాబట్టి ఆయన తన భార్య అయిన షర్మిల వైపు ఓటు బ్యాంకును తెర వెనకాతల నుంచి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.

నిజానికి ఈసారి కూడా క్రిస్టియన్ కోట్లు వైసీపీ కి పడతాయని ధీమాతోనే ఇన్నాళ్లు జగన్ ఉన్నారు. అయితే వైయస్ షర్మిల వ్యూహం చూస్తుంటే క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి కనీసం 10% అయినా ఓట్లు వైసీపీకి దక్కుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జగన్ మేనత్త విమలా రెడ్డి క్రిస్టియన్ ఓట్ బ్యాంకు వైసీపీ వైపు వచ్చేలా చేయటానికి చాలా శ్రమిస్తున్నారు.

నిజానికి వైయస్ జగన్మోహన్ రెడ్డిది ఏ మతం అన్నదానిపై ఇప్పటికే చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొందరు ఇదే వ్యవహారంపై కోర్టుకు కూడా వెళ్లారు. అయితే నా మతం ఇది అని వైయస్ జగన్ ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో హిందూ దేవాలయాలపై చాలా దాడులు జరిగాయి, అంతర్వేదిలో రథం తగలబడిపోతే తేనె పట్టు కోసం ఆకతాయిలు చేసిన పని అని వైసీపీ సర్కారు కట్టు కథ అల్లిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు వైఎస్ షర్మిల మనది క్రిస్టియన్ మతం అని వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే క్రిస్టియన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు సహజమే కదా అన్న చర్చ హిందూ ఓటర్లలో కలుగుతుంది. ఒకవైపు క్రిస్టియన్ ఓటు చీలిపోయి, మరొకవైపు హిందూ ఓటు బ్యాంకు నుంచి వైసీపీ పట్ల పూర్తిస్థాయి వ్యతిరేకత కనిపిస్తే వైసీపీ పరిస్థితి ఏమిటి అనే భయం వైసీపీలో బయలుదేరింది. దీంతో ఓ విధంగా ఆ పార్టీలో ప్రశాంతత కరువైందనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -