Raghu Rama Krishnam Raju: ఉండిపై ఉడుం పట్టు పట్టిన రఘురామ కృష్ణంరాజు.. అసెంబ్లీలో జగన్ కు వణుకేనా?

Raghu Rama Krishnam Raju: రఘురాం కృష్ణంరాజు కి కూటమి తరపున టికెట్ రాదు అనే భావించిన వైసీపీ వర్గం వారు సంబరాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అనూహ్యంగా తెదేపా తరఫున అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు రఘురాం కృష్ణంరాజు. ఆయన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన తన ప్రచారం కూడా ఉదృతంగానే సాగిస్తున్నారు.

కేవలం ఉండి నియోజకవర్గ పరిధిలోనే ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పటికీ మొత్తం నర్సాపురం పార్లమెంటు పరిధిలో రఘురాం అనుచరులు కూటమి అభ్యర్థుల తరఫున చాలా ఉదృతంగా ప్రచారం చేస్తుండడం గమనార్హం. నిజానికి కూటమి తరుపున రఘురాం కృష్ణంరాజుకి టిక్కెట్ రాదనే ప్రచారం జరిగింది, అయితే ఆఖరి నిమిషంలో తెదేపా అభ్యర్థి రఘురాం కృష్ణంరాజుకి లైన్ క్రియర్ చేయడంతో ఆయనకి అభ్యర్థిత్వం ఖరారు అయింది. ఇదే సమయంలో రఘురామకృష్ణంరాజు అనుచరులు జనసేన అనుచరులతో కలిసి పనిచేస్తున్న వైనం మరో మిత్రపక్షం తెదేపా కి ఆశ్చర్యంతో పాటు అమితానందాన్ని కలిగిస్తుంది.

అంతేకాదు ఈ వైఖరి వైసీపీకి మింగుడు పడటం లేదు. నిజానికి రఘురాం కృష్ణంరాజుకి నర్సాపురం లోక్ సభ సీటు వచ్చి ఉంటే ఆ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల గెలుపు బాధ్యతని ఆయనే తీసుకునేవారు, అయితే ఇప్పుడు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రఘురామ కృష్ణంరాజు, ఆయన అనుచరులు కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు.

ఉండి వరకు తీసుకుంటే రికార్డు స్థాయిలో ఆయన మెజారిటీ ఖాయం అంటున్నారు అక్కడ స్థానికులు. ఆయన ప్రభావం నర్సాపురం తాడేపల్లిగూడెం అసెంబ్లీ సిగ్మెంట్లలో కూడా చాలా పాజిటివ్ గా ఉండబోతుందని కూటమి వర్గం వారు తెగ ఆనంద పడుతున్నారు. గెలుపు తమదే అన్నట్లుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే షాక్ లో ఉన్న వైసీపీ ఈ గెలుపుని అడ్డుకోవడానికి ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు వేస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -