Nara Chandrababu Naidu: అలా జరిగి ఉంటే ఓట్లు అడిగేవాడిని కాదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nara Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం సభలో మాట్లాడారు. జగన్ పాలన గురించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కానీ వైసీపీ నాయకులు మాత్రం బాగా అభివృద్ధి చెందారు. రాజధాని లేని రాష్ట్రంలో ఉన్నందుకు ప్రజలంతా సిగ్గుపడుతున్నారని చెప్పారు చంద్రబాబు. రాష్ట్రంలో అంతా బాగుండి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి ఉంటే ఇప్పుడు తాను రోడ్ల వెంట తిరుగుతూ ఓట్లు అడిగేవాడిని కాదని వ్యాఖ్యానించారు చంద్రబాబు.

ఇప్పుడు ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థుల గెలుపు గురించే చర్చ జరుగుతోంది, కర్నూలులో ఉన్న అసెంబ్లీ పార్లమెంటు స్థానాలలో కూడా కూటమి అభ్యర్థులదే విజయం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ వస్తే మరొకసారి ప్రజలు మోసపోతారని చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పటికే ధరలు పెరిగిపోయాయని సామాన్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

కూటమి అధికారంలోకి వస్తే ధరలు పెంచబోమని హామీ ఇచ్చారు చంద్రబాబు. కరెంటు చార్జీలు, నిత్యవసర వస్తువుల ధరలను తగ్గిస్తామని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని చంద్రబాబు సూచించారు. వైసీపీలో సామాన్యులకు టిక్కెట్లు ఇచ్చారని డబ్బా కొట్టుకుంటున్నారని అయితే ఎవరికి వైసీపీ టికెట్లు ఇచ్చిందనే విషయం అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. తాము కూడా ఆస్తిపాస్తులు లేకపోయినప్పటికీ సామాన్య కార్యకర్తలకు కూడా టికెట్లు ఇచ్చామని చెప్పారు.

అందుకు ఉదాహరణగా కర్నూలు ఎంపీ టికెట్ను కురువ సామాజిక వర్గానికి చెందిన సాధారణ ఎంపీటీసీ నాగరాజుకు ఇచ్చామనే విషయం గుర్తు చేశారు. దాంతోపాటు ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి కూడా ఒక సామాన్యుడనే విషయాన్ని వెల్లడించారు. ఈ విషయం ప్రత్యర్ధులకు తెలియకపోయినా ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చారు. జగన్ మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్ట అని వైసీపీ నవరత్నాలు నవ మోసాలని, మళ్లీ అధికారంలోకి వస్తే జగన్ రాష్ట్రాన్ని అమ్మేస్తాడని హెచ్చరించారు చంద్రబాబు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -