Nara Chandrababu Naidu: చంద్రబాబు స్టామినాకు ఫిదా అవ్వాల్సిందే.. ఏడు పదుల వయస్సులో చెలరేగిపోతున్నారుగా!

Nara Chandrababu Naidu:  ఏపీలో ఎన్నికలవేళ పార్టీ ప్రచారాల జోరు ఊపందుకున్న నేపథ్యంలో అందరి దృష్టి చంద్రబాబు నాయుడు మీద పడటం గమనార్హం. చంద్రబాబు నాయుడు లో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.. ప్రస్తుతం ప్రచారం చేస్తున్న రాజకీయ నాయకులు అందరిలోనూ వయసులో పెద్దవాడు చంద్రబాబు మిగిలిన ఏపీ నేతలతో పోలిస్తే ఉత్సాహం గా పర్యటిస్తూ రాజకీయ ప్రత్యర్ధుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. 74 ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు చూపిస్తున్న ఉత్సాహం అంతా ఇంతా కాదు.

రెండు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ పార్టీ అధినేతలు కూడా చంద్రబాబు కంటే చిన్నవాళ్లే. అయినప్పటికీ ఉత్సాహం చూపించే విషయంలో ఈయన స్టామినాకు ఎవరు సరితూగటం లేదు. ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులలో ఉదయం పూట ప్రచారం చేయటానికి యువకులైన నేతలు సైతం చెమటలు కక్కుతూ సాయంత్రం వేళ కు ప్రచారాన్ని వాయిదా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేసీఆర్ సైతం తన బస్సు యాత్రను సాయంత్రం వేళలోనే నిర్వహిస్తున్నారు.

అయితే చంద్రబాబు నాయుడు మాత్రం సూర్యుడికి సవాలు విసురుతున్నట్లుగా రాత్రి, పగలు తేడా లేకుండా సభలు నిర్వహిస్తున్నారు. సోమవారం కూడా ఉదయం 11 గంటల నుంచి 1:00 వరకు టీడీపీ నేతలతో సమావేశం అవుతారు, తర్వాత డోన్ పాత బస్టాండ్ లో మూడు గంటల నుంచి 4:30 వరకు ప్రజాసభలో పాల్గొంటారు, సాయంత్రం 6 గంటల నుంచి ఏడున్నర గంటల వరకు నందికొట్కూరు పటేల్ సెంటర్లో ప్రజాగళంలో పాల్గొంటారు, రాత్రికి అల్లూరులో బస చేస్తారు.

ఇంత బిజీగా గడుపుతున్నప్పటికీ ఏమాత్రం జోష్ తగ్గకుండా ప్రత్యర్థుల మీద విమర్శలు గుప్పిస్తున్నారు చంద్రబాబు. ఆదివారం గూడూరు ప్రజాగళం సభలో మాట్లాడుతూ మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవుతుందని, జగన్ పాలనలో ఎవరికి స్వేచ్చలేదని మండిపడ్డారు. జగన్ కి డ్రైవింగ్ రాదు రివర్స్ గేర్ లో వెళ్లి రాష్ట్రాన్ని యాక్సిడెంట్ చేశాడు. మాయమాటలు చెప్పి బటన్ నొక్కితే ఆదాయం పెరగదు మంచి ఆలోచనతో కష్టపడితేనే ఆదాయం వస్తుందని చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -