Nassar: సినీ నటుడు నాజర్ కు తీవ్ర గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స!

Nassar: కొన్ని కొన్ని సార్లు నటీనటులకు సినిమా షూటింగ్ లలో అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దాంతో కొన్ని సమయంలో వారికి అవి చాలా పెద్ద పరిణామాలకే దారితీస్తుంటాయి. కొన్ని సమయంలో చిన్నచిన్న గాయాలతో మానిపోతాయి. అలా తాజాగా సీనియర్ నటుడు నాజర్ కు కూడా చిన్న ప్రమాదం జరిగింది. ఇంతకూ అసలేం జరిగింది అంటే.

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన విలక్షణ నటుడు నాజర్. ఈయన గురించి అందరికీ తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించి నటుడుగా ఒక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు. సహాయక పాత్రలతో పాటు నెగటివ్ పాత్రల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇదిలా ఉంటే ఈయనకు తాజాగా ప్రమాదం జరిగింది. తాను నటిస్తున్న ఓ సినిమా షూటింగులో స్వల్పంగా గాయపడ్డాడు నాజర్. నార్సింగ్ పీఎస్ పరిధిలో ఉన్న పోలీస్ అకాడమీ ప్రాంతంలో ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ సమయంలో ఆయన మెట్లు దిగుతుండగా అకస్మాత్తుగా కాళ్లు జారి కింద పడ్డాడు.

ఇక ఆయనకు ఎడమ కన్ను కింద కణతి భాగంలో స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక తాను నటిస్తున్న సినిమా తమిళ సినిమా కాగా ఇవాళ పోలీస్ అకాడమీ ప్రాంగణంలో ఓటీటీ షూటింగ్ చేశారు. దీంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయనకు ఆ ఘటన జరగటంతో వెంటనే ఆయనను సమీపంలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయనను రెస్ట్ తీసుకోమని చెప్పడంతో ఆయన నేరుగా తన ఇంటికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆయనకు అంత బాగానే ఉంది అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -