Bathing: చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా?

Bathing: చలికాలం వచ్చిందంటే చాలు గజగజ వణకడం ప్రారంభం అవుతుంది. రాత్రి పూట భోజనం చేసేముందు చేతులు కడుక్కోవాలన్నా అయిష్టతో కడుకుంటారు. చలికాలంలో నీరు మరింత చల్లగా ఉండటంతో స్నానం చేసేందుకు కూడా జంకుతారు.అయితే కొందరు మాత్రం చలికాలంలోనూ చల్లటి నీటితోనే స్నానం చేస్తారు. కాగా.. ఇలాంటి సీజన్‌లో చల్లనీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదా లేదా అనే అంశంపై చాలా మందికి సందేహాలు తలెత్తుతాయి. అయితే.. ఈ అంశంపై జరిగిన పరిశోధనల్లో కొన్ని ఆసక్తికర అంశాలు వెలువడ్డాయి.

 

చల్లనీటితో స్నానం చేసినప్పుడు చర్మ కణాల్లోని రిసెప్టర్లు ఎలక్ట్రిక్‌ తరంగాన్ని బ్రెయిన్‌కి పంపి అప్రమత్తం చేస్తాయి. అలాంటప్పుడు ఎక్కువ ఆక్సిజన్‌ తీసుకుంటాం. అలాగే గుండె వేగం కూడా పెరుగుతోంది. దీంతో శరీరానికి ఎనర్జీ పెరగడంతో ఒత్తిడి, నిరాశ తగ్గుతాయని పలు అధ్యయనాల్లో తేలింది. చల్లని నీటితో స్నానం చేస్తే శరీర మెటబాలిజం పెరుగుతుంది. తద్వారా అన్ని అవయవాలూ బాగా పనిచేస్తాయి. ఇమ్యూనిటీ సైతం ఒక్కసారిగా పెరుగుతుంది. చెడు కొవ్వు కరగడంతో బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. చల్లటి నీరు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా గుండె, ధమనులు బాగా పనిచేస్తాయి. చర్మ రంధ్రాలను బిగుతుగా మార్చి జుట్టును ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. అలాగే కండరాలకు విశ్రాంతి కలిగేలా చేస్తాయి.

చల్లని నీటితో స్నానం చేసిన వారికి నిద్ర కూడా బాగా పడుతుంది. చల్లదనంతో శరీరమంతా రీఫ్రెష్‌ అవుతుంది. స్నానం తర్వాత కణాలు పూర్తి విశ్రాంతిని పొందుతాయి. శరీరం వాల్చడానే నిద్రలోకి జారుకుంటారు. చల్లటి నీరంటే మరీ చల్లగా ఉండకుండా చూసుకోవాలి లేదంటే జలుబు, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సాధారణ స్థితిలో ఉండే చల్లనీటితోనే స్నానం చేయాలి.

 

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -