Bathing: స్నానం చేసే సమయంలో ఈ తప్పులు చేస్తే అరిష్టమా.. అసలేమైందంటే?

Bathing: అప్పుడప్పుడు మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు మనం ఎదుర్కొనే సమస్యలు అనుభవిస్తున్న కష్టాలకు కూడా కారణం కావచ్చు. అటువంటి వాటిలో స్నానం చేసే విషయంలో చేసే పొరపాట్లు కూడా దరిద్రానికి అరిష్టానికి కారణం అంటున్నారు. అదేలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్నానం చేసిన తర్వాత కొన్ని రకాల తప్పులను అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల దరిద్రం వెంటాడుతుంది. స్నానం చేసాక చాలామంది బకెట్లో వాటర్ ని అలానే వదిలేస్తూ ఉంటారు.

కానీ అలా విడిచి పెట్టడం మంచిది కాదు. మిగిలిన నీటిని ఎవరైనా ఉపయోగిస్తే, ఆ వ్యక్తి జీవితంపై ప్రభావం పడుతుంది. కాబట్టి వాటిని పారేయడం మంచిది. అదేవిధంగా ఎప్పుడూ బాత్రూంలో ఖాళీ బకెట్ ను ఉంచకూడదు. శుభ్రమైన నీటితోనే బకెట్ ని నింపాలి. బకెట్లో నీళ్లు లేకపోతే బకెట్ ని బోర్లించేయాలి. ఈ తప్పుని ఎప్పుడూ చేయకండి. చాలా మంది ఈ పొరపాటు చేస్తుంటారు. పెళ్లి అయిన స్త్రీలు జుట్టు తడిగా ఉన్నప్పుడు కుంకుమ పెట్టకూడదు. జుట్టు ఆరాక మాత్రమే కుంకుమని పెట్టుకోవాలి. స్నానం చేసి జుట్టుని అలాగే వదిలేస్తే ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది.

 

కాబట్టి వెంటనే తుడుచుకోవాలి..స్నానం చేయడానికి ముందు నెయిల్ కట్టర్ ని ఉపయోగించకూడదు. స్నానం చేశాక పదునైన వస్తువులను ముట్టుకోకూడదు. స్నానం చేసిన వెంటనే స్టవ్ దగ్గరికి, మంట దగ్గరికి వెళ్లడం మంచిది కాదు. స్నానం చేశాక ఏదైనా తిని ఆ తర్వాత మాత్రమే పొయ్యి దగ్గరికి వెళ్ళాలి.
తడి బట్టలను ఉతకకుండా ఉంచకూడదు. స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ ని అపరిశుభ్రంగా ఉంచకూడదు. ఈ పొరపాట్లను కనుక చేశారంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. డబ్బు కొరత కూడా ఏర్పడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -