Bedurulanka 2012: బెదురులంక 2012 రివ్యూ.. కడుపుబ్బా నవ్వుకోవాలని భావించే వాళ్లకు బెస్ట్ మూవీ ఇదే!

Bedurulanka 2012: క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ నేహా శెట్టి కలిసిన తాజా చిత్రం బెదురులంక 2012. భారీ అంచనాల నడుమ రూపొందున ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బెదురులంక ఊర్లో జరిగే ఘటనలే ఈ సినిమా కథ. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? హీరో కార్తికేయ సరైన సక్సెస్ ను అందుకున్నారా లేదా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అది 2012 డిసెంబర్ నెల. యుగాంతం అంటూ ప్రచారం జరుగుతుంది. అప్పుడు బెదురులంక అనే గ్రామంలో భూషణం (అజయ్ ఘోష్) ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ఊరి బ్రాహ్మణుడైన బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్ (రాం ప్రసాద్)లతో కలిసి ప్రజలను మరింతగా భయపెట్టాలని చూస్తాడు. యుగాంతం ఆగాలంటే ఊర్లోని బంగారం అంతా కరిగించి శివలింగం, శిలువ తయారు చేయించి గంగలో వదిలేయాలని ఆ ఊరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ)తో చెప్పిస్తాడు. దీంతో ఊరంతా భయంతో ఒప్పేసుకుంటుంది. కానీ శివ (కార్తికేయ) మాత్రం వినడు. శివ ఆల్రెడీ ప్రెసిడెంట్ కూతురు చిత్ర (నేహా శెట్టి)తో ప్రేమలో ఉంటాడు. తన మాటను ఎదురించిన శివను ఊరి నుంచి వెలేస్తాడు ప్రెసిడెంట్? ఆ తరువాత శివ ఏం చేస్తాడు? ఊరి ప్రజల మూఢ నమ్మకాలను పోగొట్టేందుకు ఏం చేస్తాడు? తన ప్రేమను ఎలా గెలిపించుకుంటాడు? యుగాంతం ఎలా ఉంటుందో ఊరి ప్రజలకు ఎందుకు చూపిస్తాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : ఇందులో దేవుడి మీద భక్తి కంటే భయమే ఎక్కువగా కనిపిస్తుందంటూ హీరో చేత చెప్పించిన డైలాగ్‌లోనూ ఎంతో అర్థం కనిపిస్తుంది. ఊరి ప్రజలంతా యుగాంతం అంటూ భయపడిపోతున్న జనాలభయాన్ని ఆసరాగా చేసుకుని దోచేయాలనే మనిషి కూడా ఉండటం ఊరంతా ఒక వైపు నిలిచి ఓ వ్యక్తి మాత్రమే వ్యతిరేకంగా నిలిస్తే మూఢ నమ్మకాలతో నిండి పోయిన మనుషులను మార్చడం ఎంత కష్టమో చూపించాడు. దర్శకుడు మంచి సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో డైరెక్టర్ సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది.

నటీనటుల పనితీరు..హీరో హీరోయిన్ల ట్రాక్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఏమీ ఉండదు. హీరో హీరోయిన్ల ప్రేమకు కారణం అంటూ ఏమీ చూపించరు. చిన్నప్పటి నుంచి ప్రేమ అంటారు కానీ ఒక్క సీన్‌లోనూ ఆ డెప్త్ కనిపించదు. ఇక ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. సెకండ్ ఆఫ్ లో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఇక శివ ఊరి ప్రజలను శివ ఆడుకునే విధానం, చనిపోతున్నామని తెలిస్తే మనిషిలో వచ్చే మార్పులు ఇలా ఎన్నో అంశాల్లో సెకండాఫ్ బెటర్ అనిపిస్తుంది. క్లైమాక్స్ మరింతగా నవ్వులు పూయించేలా ఉంటుంది. అలాగే అజయ్ ఘోష్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, రాం ప్రసాద్‌ల పాత్రలు తెగ నవ్వించేస్తాయి. సెకండాఫ్‌లో సత్య, వెన్నెల కిషోర్ ఎంట్రీలకు విజిల్స్ పడతాయి. కసిరాజుగా కనిపించిన రాజ్ కుమార్ కసిరెడ్డి అద్భుతంగా నటించాడు.

సాంకేతికత .. మణిశర్మ ఈ సినిమాకు ఇచ్చిన సాంగ్స్ ఓకే అనిపిస్తే ఆర్ఆర్ బెటర్ అనిపిస్తుంది. కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ ఇలా అన్ని డిపార్ట్మ్ంట్లు బాగానే పని చేశాయి. నిడివి కూడా తక్కువగానే ఉంటుంది. సినిమాను చాలా షార్ప్‌గా కట్ చేసినట్టు కనిపిస్తుంది. మాటలు ఆలోచింపజేస్తాయి. మతాలను టార్గెట్ చేసినట్టుగానే అనిపిస్తాయి. పాటలు అంతగా గుర్తుండవు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

ఇక చివరిగా చెప్పాలంటే ఈ సినిమా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. సినిమా మొత్తం నవ్వులు పూయిస్తూనే ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు..

 

నటీనటులు : కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి, అజయ్‌ ఘోష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్‌, గోపరాజు రమణ, ఎల్బీశ్రీరామ్‌, సత్య, వెన్నెల కిశోర్‌, గెటప్‌ శ్రీను తదితరులు.
డైరెక్టర్ : క్లాక్స్
నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పానేని
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రాఫర్‌ : సాయిప్రకాష్‌ ఉమ్మడిసింగు, సన్నీ
కూరపాటి
ఎడిటింగ్‌: విప్లవ్‌ న్యాసదం
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విప్సా ప్రగడ, కృష్ణ చైతన్య

రేటింగ్‌ః 2.75

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -