Silver Ring: వెండి ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఇన్ని ప్రయోజనాలా?

Silver Ring: జ్యోతిష్యం చెప్పేటప్పుడు ఫలానా రాయి ఉంగరం పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది అంటారు చాలామంది. అది నిజమే కానీ ఆ రాయిని అందరూ బంగారం ఉంగరంలో ఉంచడానికి ఇష్టపడతారు. అయితే వెండి కూడా మన జాతకం లో అదృష్టాన్ని తీసుకువస్తుంది. కానీ చాలామంది వెండి మీద దృష్టి పెట్టరు. అయితే వెండి ఉంగరాలను మనం ధరించడం వలన ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు చూద్దాం. పంచలోహాలలో వెండి ఒకటి.

శివుని కన్నుల నుంచి వెండి ఉద్భవించిందని కొందరు చెబుతారు. వెండి శరీరంలోని నీటి శాతాన్ని నియంత్రిస్తుందని పెద్దవాళ్లు చెబుతారు. అలాగే కఫ, పిత్త, వాత సమస్యలను కూడా తగ్గించడానికి వెండి దోహదపడుతుంది. అందుకే సాధారణ జీవితంలో వెండికి ప్రాముఖ్యత ఎక్కువ. వెండి ఉంగరాన్ని ధరించడం వలన మనలో ఉండే కోపం తగ్గుతుంది. చిటికెన వేలుకి వెండి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన మనసుకి ప్రశాంతత లభిస్తుంది.

అలాగే ఆధ్యాత్మిక చింతనను కూడా పెంచుతుంది. వెండి ఉంగరాన్ని ధరించడం వలన ప్రతికూల శక్తులని దూరం చేయవచ్చు. అలాగే వెండి ఉంగరం శరీరంలోని రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. అలాగే వాపుని తగ్గించడానికి, రక్తప్రసరణను మెరుగుపరచడానికి వెండి సహాయపడుతుంది. వెండి ఉంగరానికి చంద్రుడిని బలపరిచే అపారమైన శక్తి ఉంది. ఫలితంగా జలుబు, కీళ్ల నొప్పులని తగ్గిస్తుంది. వెండి ఉంగరానికి తనతో జోడించిన రత్నాల యొక్క శక్తిని పెంపొందించే గుణాన్ని కలిగి ఉంటుంది.

కాబట్టి ఆ రత్నం యొక్క గుణం మరింత మెరుగవుతుంది. అలాగే వెండి తెలివితేటలు,ప్రశాంతత, ఏకాగ్రతని పెంపొందిస్తుందని వేదిక్ ఆస్ట్రాలజీ చెప్తుంది. దీనివల్ల చదువులో మెరుగ్గా రాణించడానికి విద్యార్థులకు వెండి ఉంగరం ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే చంద్రునితో సంబంధం ఉన్న వెండి ఉంగరాన్ని ధరించడం ద్వారా సైకిక్ ఎబిలిటీస్ పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడం సాధ్యమవుతుంది. సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -