Bharateeyans Movie Review: భారతీయన్స్ సినిమా రివ్యూ & రేటింగ్

Bharateeyans Movie Review: విడుదల తేదీ: జూలై 14, 2023

నటీనటులు: నీరోజ్ పుచ్చా, సుభారంజన్, సోనమ్ టెండప్, సమైరా సందు, పెడెన్ నాంగ్యాల్, రాజేశ్వరి చక్రవర్తి, మహేందర్ బర్కాస్ తదితరులు

నిర్మాణ సంస్థ: భారత్ అమెరికన్ క్రియేషన్స్

నిర్మాత: శంకర్ నాయుడు అడుసుమిల్లి

దర్శకత్వం: దీనరాజ్

సంగీతం: సత్య కశ్యప్, కపిల్ కుమార్

సినిమాటోగ్రఫీ: జయపాల్ రెడ్డి నిమ్మల

ఎడిటర్:

 

పలు తెలుగు సినిమాలకు రచయితగా చేసిన దీన రాజ్ తొలిసారిగా భారతీయన్స్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో నీరోజ్ పుచ్చా, సుభారంజన్, సోనమ్ టెండప్, సమైరా సందు, పెడెన్ నాంగ్యాల్, రాజేశ్వరి చక్రవర్తి, మహేందర్ బర్కాస్ తదితరులు నటించారు. భారత్ అమెరికన్ క్రియేషన్స్ బ్యానర్ పై శంకర్ నాయుడు అడుసుమిల్లి ఈ సినిమాను నిర్మించారు. సత్య కశ్యప్, కపిల్ కుమార్ సంగీతం అందించగా.. జైపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రఫి బాధ్యతలు చేపట్టాడు. ఇక ఇప్పటికే దేశభక్తి నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇక అటువంటిదే ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకున్నాయి. ఇక ఈరోజు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ భాషల్లో రాగా వారికి ఈ సినిమా ఏ విధంగా కనెక్ట్ అయిందో చూద్దాం.

కథ: భారత దేశంలోని తెలుగు, భోజ్ పురి, నేపాలి, పంజాబీ, బెంగాలీ, త్రిపురకు అనే ఆరు ప్రాంతాలకు చెందిన ఆరుగురు వ్యక్తుల సమూహమే ఈ సినిమా. ఇక ఆ ఆరుగురిలో ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉండగా వీళ్ళు దేశం అంటే చాలా భక్తి చూపిస్తారు. ఇక ఓసారి ఈ ఆరుగురిని కొన్ని వేరువేరు సమస్యలు వెంటాడుతాయి. ఆ ఆరుగురు ఆ సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వారికి కొందరి అజ్ఞాత వ్యక్తులు సహాయం చేస్తామని.. మీ సమస్యలతో పాట మీ ఫ్యామిలీకి కూడా తోడుగా ఉంటామని ధైర్యం చెప్పి ఆశ చూపిస్తారు. కానీ అలా చేయాలంటే దాని కోసం ఒక పని చేయాలి అని ఒక సీక్రెట్ విషయం కోసం మీరు బార్డర్ దాటి చైనాకి చేరుకోవాల్సి వస్తుంది అని అంటారు. అలా వీరు ఆ అజ్ణాత వ్యక్తుల మాటలు వింటారా.. అసలు ఆ సీక్రెట్ మిషన్ ఏంటి.. ఆ ఆరుగురికి అక్కడికి వెళ్లిన తర్వాత ఎదురైనా సమస్యలు ఏంటి.. చివరికి వీళ్లంత సీక్రెట్ మిషన్ ను సక్సెస్ చేస్తారా లేదా అనేది మిగిలిన కథలోనిది.

నటీనటుల పనితీరు: నటీనటుల విషయానికి వస్తే కొంతమంది నటుల పర్ఫామెన్స్ పరవాలేదు అనిపించిన కూడా మరి కొంతమంది సరిగ్గా పెర్ఫార్మన్స్ చేయనట్లు కనిపించారు.

విశ్లేషణ: ఇప్పటికే దేశభక్తి నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. చాలా వరకు దేశభక్తి సినిమాలు ఎమోషన్స్ పాయింట్ తో ఎదురవుతాయి. ఇక ఈ సినిమాను కూడా డైరెక్టర్ ఎమోషన్ సీన్స్ తో చూపించాడు. ప్రేక్షకులకు కనెక్ట్ చేయడానికి బాగా ప్రయత్నించాడు.

ప్లస్ పాయింట్స్: కథ కథనం, కొన్ని సన్నివేశాలు కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. ఎమోషన్స్.

మైనస్ పాయింట్స్: నటీనటుల పర్ఫామెన్స్, కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించాయి.

3/5

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -