Chintamaneni Prabhakar Vs Abbaya Chowdary: లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్.. దెందులూరు నియోజకవర్గంలో గెలుపు అతనిదేనా?

Chintamaneni Prabhakar Vs Abbaya Chowdary: దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ చౌదరి తనదైన శైలిలో రాజకీయం చేయటంలో తన ప్రత్యేకత కనబరిచారు అయితే రెండుసార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ఈయన గత ఏడాది వైసిపి అభ్యర్థి అబ్బయ్య చౌదరి చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు అధికంగా ఉండడంతో గత కొంతకాలంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకే టికెట్లు ఇస్తున్నారు.

ఇకపోతే గత ఎన్నికలలో కూడా చింతమనేని వర్సెస్ అబ్బయ్య చౌదరి అనేలా పోటీ నెలకొంది అసలు అబ్బయ్య చౌదరి ఎవరు అనేది కూడా ఆ ప్రాంత ప్రజలకు తెలియదు. ఈయన లండన్ లో ఉంటారు తన తండ్రి కొఠారు రామచంద్రరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో పోలింగ్‌ తేదీకి కొద్ది రోజుల ముందు వచ్చిన ఈయన ఎన్నికలలో నిలబడి 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఇక అబ్బయ్య చౌదరి గెలిచిన తర్వాత కూడా తను ఎవరు ఏంటి అనే విషయాలు నియోజకవర్గ ప్రజలకు పెద్దగా తెలియవు. ఈయన గెలిచిన ఎక్కువగా లండన్ లోనే ఉంటారు. ఇక్కడ రాజకీయాలను తన తండ్రి నడిపిస్తూ ఉంటారు. ఇక అబ్బయ్య చౌదరి గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడమే కాకుండా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు ఇసుక దోపిడికి పాల్పడి సొమ్ము చేసుకున్నారు.

మరోవైపు చింతమనేని పట్ల ప్రభుత్వ వ్యతిరేకంగా భారీ స్థాయిలో కేసులు నమోదు చేసింది ఈయనకు కాస్త దురుసు ఎక్కువే అన్నప్పటికీ కూడా ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాటం చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాంతంలో టిడిపికి కాకుండా బిజెపికి సీటు ఇవ్వాలని భావించారు కానీ అక్కడ చింతమనేనికి మంచి ఆదరణ ఉండటంతో చివరికి ఆయనకే టికెట్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఈసారి దెందులూరులో లోకల్ మాస్ లీడర్ వర్సెస్ లండన్ బాబు అనేలాగే పోటీ నెలకొంది గత ఎన్నికలలో ఈవీఎం మ్యాజిక్ కారణంగా తాను ఓటమిపాలు అయ్యానని ఈసారి మాత్రం అలాంటి మ్యాజిక్స్ ఏమీ జరగవని తాను 40 ఓట్ల మెజారిటీతో గెలుస్తానంటూ చింతమనేని ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి ఈ ఎన్నికలలో విజయం చింతమనేనిదా లేకపోతే లండన్ బాబుదా అనేది మరి కొద్ది రోజులలో తెలియనుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -