Corporator Srivani: నేను ఎన్నిసార్లు చెప్పినా కేటీఆర్ పట్టించుకోవట్లేదు.. కార్పొరేటర్ శ్రీవాణి సంచలన వ్యాఖ్యలు!

Corporator Srivani: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వానలు దంచి కొడుతున్నాయి. అయితే హైదరాబాదులో వర్షాలు మరింత ఎక్కువగా పడటంతో రోడ్లు సైతం నదులులా మారిపోయాయి. ఈ క్రమంలోనే స్థానికులు బయటకు రావాలన్నా కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే గద్వాల్ మున్సిపల్ కార్పొరేట్ పరిధిలో ఎక్కువగా వర్షాలు రావడంతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని తాజాగా కార్పొరేటర్ శ్రీవాణి పురిపాలక శాఖ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో కూడా ఈమె ఇలా వర్షాలు వచ్చిన సందర్భంలో తన కార్పొరేటర్ పరిధిలో వర్షపునీరు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను తెలియజేశారు. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టినటువంటి మ్యాన్ హోల్స్ ఎటు పనికి రాకుండా కట్టడంతోనే ఈ ఇబ్బందులు తలెత్తయని అందుకోసం ఈమె చిన్న రాళ్ళను పేరుస్తూ ఇక్కడ ఇలా కడితే ప్రజలు ఏ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కోరు అంటూ రాళ్ళను పేర్చి చూపించారు అయితే ఈ విషయంపై ఈమెను భారీ స్థాయిలో ట్రోల్ చేశారు.

తాజాగా మరోసారి వర్షాలు ఎక్కువగా పడటంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇదే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే ఈమె స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి ఈ విషయం గురించి తాను గతంలో చెబితే తనని చాలామంది ట్రోల్ చేశారు. అయితే ట్రోల్ చేయడం కాదు ఈ విషయాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు పరిగణలోకి తీసుకోవాలని ఇక్కడ ప్రజల కష్టాలను తీర్చాలంటే ఈమె సోషల్ మీడియా వేదికగా వీడియోలతో సహా బయటపెట్టారు.

కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు చేసి కట్టినటువంటి మ్యాన్ హోల్ లోకి నీళ్లు వెళ్ళకుండా బయటకు వెళ్తున్నాయని తద్వారా రెండు కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయని ఇక్కడ ప్రజలు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికైనా కేటీఆర్ స్పందించి ఇక్కడ పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా శ్రీవాణి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -