Smart Watch: అతి తక్కువ ధరకే బోటు స్మార్ట్ వాచ్.. ధర, టీచర్స్ ఇవే?

Smart Watch: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకీ మార్కెట్లో స్మార్ట్ వాచ్ లోకి ఉన్న క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. దీంతో ఆయా కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ వాచ్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించడం కోసం అద్భుతమైన ఫీచర్లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ వాచ్ లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ బోట్ తాజాగా మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ వాచ్‌ను తీసుకొచ్చింది. బోట్ వేవ్‌ ఎలెక్ట్రా పేరుతో లాంచ్‌ చేసింది.

మరి ఈ బోట్ వేవ్ ఎలెక్ట్రా వాచ్ ధర, ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మార్కెట్లోకి విడుదల చేసిన ఈ స్మార్ట్‌ వాచ్‌ ను 1.81 ఇంచెస్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో గరిష్టంగా 50 వరకు ఫోన్‌ కాంటాక్ట్స్‌ను స్టోర్‌ చేసుకోవచ్చు. ఆన్‌బోర్డ్‌ హెచ్‌డీ మైక్‌ను కూడా అందించారు. బ్లూటూత్ కాలింగ్‌తో వాచ్‌ తోనే కాల్స్‌ సైతం మాట్లాడుకోవచ్చు. బోట్‌ వేవ్‌ ఎలక్ట్రా వాచ్‌లో మల్టీ సెన్సార్‌ సిస్టమ్ అందించారు. దీంట్లోని 100 ప్లస్ స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు పాటు హార్ట్ రేట్, స్లీప్ మానిటర్, SpO2 ట్రాకింగ్, బ్రీత్ ట్రైనర్‌ వంటి ఫీచర్లతో యూజర్లు హెల్త్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఇక వాచ్‌ను బోట్ యాప్‌తో స్మార్ట్‌ ఫోన్‌ను లింక్‌ చేసుకోవచ్చు. దీని ద్వారా 100 ప్లస్ వాచ్ ఫేసెస్, విడ్జెట్స్, రెండు కన్వర్టబుల్ మెను స్టైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వాచ్ నుంచే స్మార్ట్‌ఫోన్‌లో మ్యూజిక్, కెమెరాను కంట్రోల్‌ చేసుకోవచ్చు. బోట్ వేవ్‌ ఎలక్ట్రా స్మార్ట్‌ వాచ్‌ మనకు నాలుగు కళ్ళల్లో లభిస్తోంది. సిలికాన్ స్ట్రాప్ లైట్ బ్లూ, బ్లూ, బ్లాక్, చెర్రీ బ్లాసమ్ కలర్స్‌లో అందించారు. ఇకపోతే ఈ స్మార్ట్ వాచ్ ధర విషయానికొస్తే రూ. 1799కి అందుబాటులో ఉంది. వాచ్‌ను బోట్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Gedela Srinubabu: టీడీపీలోకి గేదెల శ్రీనుబాబు.. వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ అయితే తప్పదా?

Gedela Srinubabu: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది జప్పింగ్ జపాంగ్‌లు పెరిగిపోతున్నారు. అన్ని పార్టీల్లో ఇది కామన్‌గా ఉన్నా.. అధికార వైసీపీ నుంచి ఎక్కువ మంది పార్టీని వీడుతున్నారు. ఆ పార్టీకి...
- Advertisement -
- Advertisement -