Smart Watch: అతి తక్కువ ధరకే యాపిల్ ను పోలిన స్మార్ట్ వాచ్.. ధర ఎంతో తెలుసా?

Smart Watch: మార్కెట్లో యాపిల్ ప్రోడక్ట్స్ అయినా స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్ లకు ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. యాపిల్ స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా యాపిల్ స్మార్ట్ వాచ్ లో కూడా అదే రేంజ్ లో ఆదరణను దక్కించుకున్నాయి అని చెప్పవచ్చు. కానీ చాలామంది యాపిల్ సంస్థ ధరల విషయంలో వెనకడుగు వేస్తూ ఉంటారు. తాజాగా యాపిల్ వాచ్ మోడల్ ను పోలిన ఒక స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది ఫైర్‌ బోల్ట్ కంపెనీ. ఈ స్మార్ట్ వాచ్ అచ్చం యాపిల్ వాచ్ ను పోలి ఉంది. ‌ఫైర్ బోల్ట్‌ గ్లాడియేటర్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫైర్‌ బోల్ట్ స్మార్ట్ వాచ్ లో మంచి ఫీచర్లను అందించారు.

ఇకపోతే ఈ ఫైర్‌ బోల్ట్ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 1.96 ఇంచెస్‌ డిస్‌ప్లే ను అందించారు. అలాగే ఈ స్మార్ట్ వాచ్ 600 నిట్స్‌ బ్రైట్‌ నెస్‌తో పనిచేస్తుంది. ఈ వాచ్ కేవలం 5 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 24 గంటలపాటు దీనిని ఉపయోగించుకోవచ్చు. కాగా ఈ స్మార్ట్ వాచ్‌లో హార్ట్‌ రేట్, ఎస్‌పీఓ2 లతో పాటుగా మహిళల కోసం ప్రత్యేకంగా మెనుస్ట్రుయల్ సైకిల్ ఫీచర్‌ను అందించారు. కాగా వీటితో పాటు ఇందులో ఐపీ67 వాటర్‌ రెసిస్టెంట్‌ను కూడ అందించారు.

ఈ వాచ్‌ లు బ్లాక్‌, బ్లూ, గోల్డ్‌ కలర్ లలో మనకు మార్కెట్ లో అలాగే ఆన్లైన్ లో కూడా లభిస్తున్నాయి. కాగా ఈ స్మార్ట్ వాచ్ డిసెంబర్‌ 30 నుంచి ఆన్‌లైన్‌ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇకపోతే ఈ ఫైర్‌ బోల్ట్ స్మార్ట్ వాచ్ ధర విషయానికొస్తే రూ. 2499కి అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్ వాచ్ అతి తక్కువ ధరకే మంచి ఫీచర్లను కలిగి ఉండడంతో వినియోగదారులు దీనిని కొనడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -