Cheap Flight Tickets: తక్కువ ధరకే విమాన టికెట్లు.. విమానంలో ప్రయాణించాలనే వాళ్లకు తీపికబురు ఇదే!

Cheap Flight Tickets: గూగుల్ మరొక కొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. ఈ ఫీచర్ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది. విమానాల్లో ప్రయాణించాలనుకునే దిగువ మధ్య తరగతి ప్రజల కోరిక ఈ ఫీచర్ తో తీరబోతుంది. ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటంటే గూగుల్ ఫ్లైట్స్. దీని ద్వారా తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్ కొనుక్కునే అవకాశం ఉంటుందని తెలిపింది గూగుల్. ఈ ఫీచర్ విమాన టికెట్లు కొనుగోలు చేసేందుకు సరైన సహకారం సహా ఇతర కీలక సూచనలు అందిస్తుంది.

తన వద్దనున్న డేటా ఆధారంగా ఈ సలహాలు అందిస్తుంది. ఈ ఫీచర్ ఈ వారంలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపింది గూగుల్. ఏ సమయంలో టిక్కెట్లు బుక్ చేసుకుంటే తక్కువ ధరకు లభిస్తాయో ఈ ఫీచర్ సూచిస్తుంది. దానిని బట్టి మనకి ఫ్లైట్ ప్రయాణం మన బడ్జెట్లో ఉంటే మనం చక్కగా ఫ్లైట్లోనే వెళ్ళవచ్చు. గూగుల్ ఫ్లైట్స్ ఫీచర్ ధరల ట్రాకింగ్ సహా అనేక విధాలుగా సాయం చేస్తుందని గూగుల్ తన బ్లాగ్ లో రాసుకొచ్చింది.

 

రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో టికెట్ల బుకింగ్ కోసం మంచి ఆఫర్లను సూచించడం తో పాటు సరైన తేదీని కూడా చెబుతుంది. దీనిని బట్టి మనం మన ట్రావెలింగ్ కి సంబంధించిన ప్లానింగ్ లు చక్కగా వేసుకోవచ్చు. విమాన టికెట్ల తగ్గింపు ధర కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ గూగుల్ ఫ్లైట్స్ ట్రాకింగ్ ని వినియోగించుకోవచ్చు. మీరు ఎంచుకున్న మార్గాలు తేదీలలో ధరలు తగ్గితే ఈ ఫీచర్ మిమ్మల్ని అలెర్ట్ చేస్తుంది.

 

ఇందులో ఉండే మరొక ప్రత్యేకత ఏంటంటే దీని ద్వారా మీరు ఒక బ్యాడ్జిని పొందుతారు. టిక్కెట్లు బుక్ చేసుకున్న తర్వాత మళ్లీ టిక్కెట్లు ధరలు తగ్గితే జరిగిన నష్టాన్ని గూగుల్ భర్తీ చేస్తుంది. ఫోన్ పే ద్వారా మీ మిగిలిన మొత్తాన్ని మీకు బదిలీ చేస్తుంది. అలాగే సోషల్ మీడియా ల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. నిజంగానే ఈ ఫీచర్ మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగం.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -