Digestive problems: జీర్ణక్రియ సమస్యలకు టమోటాతో చెక్ పెట్టండిలా?

Digestive problems: మన వంటింట్లో దొరికే కూరగాయలలో టమోటా కూడా ఒకటి. టమోటాలను పప్పు, రసం, చట్నీ, సాంబార్, ఇలా చాలా వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటారు. టమోటా పండు వంటలతో పాటు చాలామంది నేరుగా కూడా తింటూ ఉంటారు. టమోటాలలో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెర, పీచు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ సి వంటివి శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. అలాగే విటమిన్ బి6, రైబోఫ్లావిన్ అందుతాయి. కాగా అప్పుడప్పుడు జీర్ణవ్యవస్థలో సమస్యలు వస్తూ ఉంటాయి.

 

ఈ మధ్య కాలంలో చాలామంది గ్యాస్, అజీర్తి, ఎసిడిటి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల బయటపడటం కోసం చాలామంది ఈనో, గ్యాస్ టాబ్లెట్స్ వాడుతుంటారు. మరికొందరు జీలకర్ర జ్యూస్ వంటివి తీసుకుంటుంటారు. కానీ టమోటా తీసుకోవడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు దూరం అవుతాయి. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే గట్ బయోమ్ అనే మంచి సూక్ష్మజీవులు అవసరం. అయితే ఇవి టమాటాలతో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వలన వృద్ధి చెందుతాయి. టమోటాలు గట్‌ బయోమ్‌పై పాజిటివ్ ప్రభావం చూపిస్తాయి.

పేగుల్లో ఉన్న జీర్ణాశయ సంబంధిత ఆమ్లాలు గింజల వెలుపలి పొరను జీర్ణం చేసి, ఆ తర్వాత మలం ద్వారా శరీరం నుండి వ్యర్దాలను తొలగిస్తాయి. టమోటా గింజల వలన అపెండిసైటిస్ సమస్య వస్తుందని చాలా మంది అపోహ పడుతుంటారు. నిజానికి విటమిన్ ఎ మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఈ విత్తనాలు, డైల్యూటెడ్ ఫైబర్ నిల్వలకు గొప్ప మూలం అని చెప్పవచ్చు. అపెండిసైటిస్ సమస్యకు ఇవి ఏమాత్రం కారణం కాదు. అయితే టమోటా విత్తనాల వెలుపలి భాగంలో కనిపించే సహజ సిద్ధమైన జెల్ మీ రక్తప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -