Cognizant Recruitment 2023 for Freshers: తెలుగు వస్తే 35,000 రూపాయల వేతనంతో ప్రముఖ సంస్థలో జాబ్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

Cognizant Recruitment 2023 for Freshers: డిగ్రీలు పూర్తి చేసి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేక ఇంట్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇది శుభవార్త అని చెప్పాలి. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వేటలో ఉన్నవారు ప్రముఖ ఐటీ సంస్థ అయినటువంటి కాగ్నిజెంట్ లో ఎలాంటి ఖర్చులేకుండా నెలకు 35వేల రూపాయల జీతం అందుకునే ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. మరి ఈ ఉద్యోగం ఏంటి ఇందుకు ఏమి అర్హతలు ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయానికి వస్తే…

ప్రముఖ కాగ్నిజెంట్ కంపెనీ అధికారిక వెబ్సైటు ద్వారా ఈ జాబుకు మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ మోడరేటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నిర్వహిస్తున్నటువంటి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పనిసరిగా అభ్యర్థులు 18 సంవత్సరాలు పూర్తి నిండి ఉండాలి అలాగే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే డిగ్రీ లేదా బిఈ, లేదా బీటెక్ పూర్తి చేసిన వారు మాత్రమే ఇందుకు అర్హులు.

కాగ్నిజెంట్ అధికారక వెబ్సైట్ ద్వారా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది అయితే దరఖాస్తు చేసుకోవడానికి రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఏ విధమైనటువంటి రాత పరీక్ష కూడా లేదు. ఇంటర్వ్యూలో ఎంపికైన తర్వాత మూడు నెలల పాటు కంపెనీ వారే ట్రైనింగ్ ఇస్తారు. ఈ ఉద్యోగానికి ఏ విధమైనటువంటి అనుభవం కూడా అవసరం లేదు.

ఈ మూడు నెలలు ట్రైనింగ్ పీరియడ్ లో కూడా 35వేల రూపాయలు చొప్పున జీతం చెల్లిస్తారు. ఇక ఉద్యోగంలోకి చేరిన తర్వాత యధావిధిగా జీతాలు పెరుగుదల ఉంటుంది. ఇక ఇంటర్వ్యూలో ఎంపికైనటువంటి వారు ఉద్యోగ నిమిత్తం ఏ ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సిన పనిలేదు. వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించారు కనుక ఇంటి నుంచే మనం పని చేసుకోవచ్చు. ఇలా ఏ విధమైనటువంటి రాత పరీక్ష లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఈ ఇంటర్వ్యూకు హాజరవుతే నెలకు 35 వేల రూపాయల జీతం పొందవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -