Munugodu Bypoll: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్? అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

Munugodu Bypoll: మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉపఎన్నిక కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్యగా మారింది. ఇప్పటికే పార్టీలో సీనియర్ నేతల మధ్య పోరు, రేవంత్ రెడ్డిపై నేతల తిరుగుబాటుతో, సీనియర్లు అంటీముంటనట్లుగా ఉండటంతో తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నా.. లేనట్లుగానే ఉంది. పార్టీలోని విబేధాలతో ప్రజల్లో కూడా కాంగ్రెస్ పల్ల చులకన భావం ఏర్పడుతోంది. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా దూకుడు పెంచుతూ గట్టిగా పోరాటం చేస్తుండటంతో.. ఆ పార్టీకి ప్రజల్లో మైలేజ్ పెరుగుతూ వస్తుంది. నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో కాంగ్రెస్ ఏ కార్యక్రమం చేపట్టినా ముఖ్య నేతలు సహకరించడం లేదు.

ఇలాంటి తరుణంలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ తప్పనిసరిగా గెలవాల్సి పరిస్థితి. సిట్టింగ్ స్ధానం కూడా కావడంతో కాంగ్రెస్ గెలకపోతే దాని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పడే అవకాశముంది. రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత వీక్ అయ్యే ప్రమాదముంది. దీంతో మునుగోడు ఉపఎన్నికలను కాంగ్రెస్ హైప్రయారిటీగా తీసుకుంది. అమిత్ షా రాజగోపాల్ రెడ్డిని కలిసిన దగ్గర నుంచే కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఢిల్లీలో అగ్రనేతలతో టీ కాంగ్రెస్ నేతలు తరచూ భేటీ అవుతున్నారు. ముందుగానే అలర్ట్ అయిన కాంగ్రెస్.. మునుగోడులోని క్యాడర్ రాజగోపాల్ రెడ్డి వైపు వెళ్లకుండా చర్యలు చేపట్టింది.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే బీజేపీ, టీఆర్ఎస్ కంటే ముందే మునుగోడు నియోజకవర్గంలోని చుండూరులో భారీ బహిరంగ సభ నిర్వహించింది. మండలాల వారీగా ఇంచార్జ్ లను నియమించి ఉపఎన్ని బాధ్యతలను అప్పగించింది. మన మనుగోడు-మన కాంగ్రెస్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటీవల లక్ష ఓటర్లను కలుసుకుంది. నేతలు లక్ష ఓటర్ల దగ్గరకు వెళ్లి వందనం చేశారు.

అయితే అభ్యర్ధి విషయంపై కూడా కాంగ్రెస్ ముందడుగు వేసింది. ఉపఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది. పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతికే టికెట్ ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ఢిల్లీలో ప్రియాంగగాంధీతో రేవంత్ రెడ్డితో పాటు భట్టి, ఉత్తమ్, శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మధుయాష్కీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మునుగోడు అభ్యర్ధిని ఫిక్స్ చేసినట్లు సమాచారం. పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతూరిగా స్రవంతికి అక్కడ క్యాడర్ తో సత్సబంధాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసింది.

కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు నిర్వహించిన పలు సర్వేల్లో కూడా స్రవంతికే బలం ఉందని తేలిందట. దీంతో ఆమెకు టికెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై టీ కాంగ్రెస్ అధికారికంగా ప్రకటన చేయనుందని సమాచారం. వచ్చే నెలలో ప్రియాంక గాంధీ మునుగోడు ప్రచారానికి రానున్నారు. మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆలోపు కాంగ్రెస్ అభ్యర్ధిగా స్రవంతి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -