Vinutha: బస్సుల్లో చదివిన బంగారు తల్లి.. ఈ విద్యార్థిని సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే!

Vinutha: మన చుట్టూ ఎంతోమంది జీవితంలో మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వారు ఉంటారు. అయితే వారు జీవితంలో ఎంతో కష్టపడి అవమానాలను కష్టాలను ఎదుర్కొని నేడు అంత మంచి పొజిషన్లోకి వచ్చి ఉంటారు. అటువంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక అమ్మాయి కూడా ఒకరు. ఎంతో కష్టపడి పైకి వచ్చిన ఆ అమ్మాయి సక్సెస్ స్టోరీని ఒకసారి ఆ అమ్మాయి మాటల్లోనే విని మనం తెలుసుకుందాం.. నాన్న జయరాం సర్వేయర్‌ డిపార్ట్‌మెంట్‌లో హెల్పర్‌. అమ్మ చంద్రిక. ఇద్దరూ పదో తరగతి మాత్రమే చదివారు. నాది భద్రత లేని ఉద్యోగం. నువ్వయినా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలి అని నాన్న నాకు ఊహ వచ్చినప్పటి నుంచీ చెప్పిన మాటి.

అందుకే నా దృష్టంతా చదువు మీదే! పది, ఇంటర్‌ల్లో 90 శాతంపైగా మార్కులు సాధించడంతో బెంగళూరులో మంచి కళాశాలలో సీటొచ్చింది. మేము ఉండేది ఆనేకల్‌. రానూపోనూ ప్రయాణానికే ఆరు గంటలు పడుతుంది. పోనీ బెంగళూరులో హాస్టల్‌లో ఉందామన్నా, గది అద్దెకు తీసుకుందామన్నా స్థోమత సరిపోదు. దీంతో రోజూ వెళ్లి రావడానికే మొగ్గు చూపాను. కళాశాలకు చేరుకోవాలంటే మూడు బస్సులు మారాలి. ఉదయం 6గంటలకు ఇంట్లోంచి బయటికెళితే తిరిగి చేరుకునే సరికి రాత్రి 8 అయ్యేది. అంత దూరం ప్రయాణం ఎవరికైనా విసుగే. కానీ నేను దాన్ని వినియోగించుకోవాలి అనుకున్నాను. బస్టాండ్‌, బస్సు అన్న తేడా లేకుండా ఎక్కడ సమయం దొరికినా పాఠాలు చదివేదాన్ని. ఇంటికొచ్చాక కొద్దిసేపు చూసుకుంటే సరిపోయేది.

అలా చదివే డిగ్రీలో 85శాతం మార్కులు తెచ్చుకున్నాను. పీజీకి బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో సీటొచ్చింది. కెంగేరిలో ఉండే విశ్వవిద్యాలయానికి వెళ్లి రావడానికి 8గంటలు పడుతుంది. డిగ్రీలో నా కష్టం చూసిన నాన్న తట్టుకోలేక పోయారు. అప్పు చేసైనా హాస్టల్‌ ఫీజు కడతాను అన్నారు. మా ఆర్థిక పరిస్థితి తెలిసిన నేను అందుకు ఒప్పుకోలేదు. నాన్నకు అంత శ్రమ ఇవ్వాలనుకోలేదు. అందుకే కాస్త దగ్గర్లోని ఆక్స్‌ఫర్డ్‌ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌లో చేరాను. దీనికీ రెండు బస్సులు మారాలి. రోజూ పెద్ద పెద్ద పుస్తకాలు మోయటం భారంగా తోచేది. అందుకే కళాశాల ముగిశాక గంట అదనంగా ఉండి, నోట్స్‌ రాసుకునేదాన్ని. దాన్ని బస్సుల్లో చదువుకునేదాన్ని. నా కష్టం చూసి స్నేహితులు ఫీజు మేం కడతాం.. హాస్టల్‌లో ఉండి చదువుకోమన్నా సున్నితంగా తిరస్కరించాను. సబ్జెక్టు నేర్చుకోవాలి, మంచి మార్కులు సాధించాలి అనే తపన పడేదాన్ని.

కానీ యూనివర్సిటీలో ప్రథమ ర్యాంకు సాధిస్తానని అనుకోలేదు. స్నాతకోత్సవం రోజు బంగారు పతకాలు ప్రకటిస్తూ వినుత అని పిలిస్తే నన్ను కాదేమో అనుకున్నా. అలాంటిది వరుసగా ఎనిమిది అందుకున్నా. మూడు నగదు బహుమతులూ వచ్చాయి. ఈ ఏడాది అత్యధిక పతకాలు తీసుకున్నది నేనేనని తెలిసి నాన్న ఆనందానికి అవధుల్లేవు. పీహెచ్‌డీ చేయాలని కల. అయితే నాన్నకోసం ముందు ప్రభుత్వోద్యోగం సంపాదించాలి. అది సాధించాక పీహెచ్‌డీపైనా దృష్టిపెడతాను అని చెప్పుకొచ్చింది బెంగళూరుకు చెందిన ముకుంద.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -