Deepesh Kumari Success Story: తండ్రి స్నాక్స్ అమ్ముతాడు.. కూతురు ఐఏఎస్.. ఈ యువతి సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

Deepesh Kumari Success Story:  చదువుకోవాలి అనే తపన ఒక మనిషిని ఎంత దూరమైనా తీసుకువెళుతుంది. అదే తపన, అదే పట్టుదల వాళ్లని పదిమందిలో ఒకరిగా నిలబెట్టి ఎనలేని కీర్తిని తీసుకువస్తుంది. అలాంటి ఒక పట్టుదల గలిగిన అమ్మాయి దీపేష్ కుమారి. ఒకవైపు పేదరికంతో పోరాడుతూ మరోవైపు లక్ష్యాన్ని సాధించాలనే తపనతో కష్టపడి సివిల్స్ పరీక్షలో 93వ ర్యాంకు సాధించిన ఈమె సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.

రాజస్థాన్ రాష్ట్రంలోని ఆటల్ బ్యాండ్ ప్రాంతానికి చెందిన ఒక చిరు తిండి వ్యాపారి కూతురు దినేష్ కుమారి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ చదువులో తన సత్తా చాటుకున్నారు. చదువు విషయంలో తండ్రి గోవింద సపోర్ట్ ఉండటంతో ఆమె కెరియర్ పరంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు. తన తండ్రికి ఉన్న ఐదుగురు సంతానంలో ఈమె పెద్ద కుమార్తె కాగా ఇమే శిశు ఆదర్స్ విద్యా మందిర్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది.

తర్వాత పదో తరగతిలో 98%, ఇంటర్లో 89% మార్పులు సాధించి ఐఐటి బాంబేలో ఎంటెక్ పూర్తి చేశారు. ఈమె రెండో ప్రయత్నంలోనే సివిల్స్ ని సాధించడం చెప్పుకోవలసిన విషయం. కుటుంబ సభ్యుల సహకారం వల్లే తనకి సక్సెస్ సొంతమైంది అన్నట్లు చెప్పుకొచ్చారు దీపేష్ కుమారి. అయితే దీపేష్ కుమారి సోదరీమణులు సైతం మంచి ర్యాంకులు సాధించి కెరియర్ పరంగా ముందడుగులు వేస్తున్నారు.

దీపేష్ కుమారి తనలా ఐఏఎస్ కావాలి అనుకున్న వాళ్ళకి తనవంతు సహాయం చేస్తుందని తెలుస్తోంది. అయితే బిడ్డలు ఎంత మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఆ తండ్రి ఇంకా అదే చిరుతిండి వ్యాపారం చేస్తూ జీవితాన్ని గడపడం అనేది నిజంగా మెచ్చుకోదగిన విషయం. ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఇంకా ఏదో సాకు చెప్పే విద్యార్థులకు నిజంగా ఈమె ఒక స్ఫూర్తి ప్రదాత. ఈమె జీవితంలో మరిన్ని విజయాలని అందుకోవాలని ఆకాంక్షిద్దాం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -