Ohio: ఈ చిన్నారి ఇంత ఘోరమైన పని చేసిందా.. ఏమైందంటే?

Ohio: అభం శుభం తెలియని రెండేళ్ల చిన్నారి తెలియక చేసిన పనికి తల్లితోపాటు కడుపులో బిడ్డ కూడా ప్రాణం కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆట వస్తువు అనుకున్న రెండేళ్ల చిన్నారి తన తల్లిని తుపాకీతో కాల్చి చంపటం స్థానికంగా సంచలనం రేపుతోంది. అమెరికాలోని వాషింగ్టన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లారా అనే 32 ఏళ్ల మహిళ అమెరికాలోని ఒహయో అనే ప్రాంతంలో తన భర్త, రెండేళ్ల కుమారుడితో కలసి నివసిస్తోంది. ప్రస్తుతం ఆమె మళ్లీ ఎనిమిది నెలల గర్భంతో ఉంది. అయితే ఇటీవల లారా భర్త ఆఫీసుకి వెళ్లిన తర్వత తన రెండేళ్ల కుమారుడితో పాటు ఆమె ఇంట్లోనే ఉంది. ఈ క్రమంలో చిన్నారి బెడ్రూమ్ లోకి వెళ్లి అక్కడ ఫుల్ లోడ్ అయిన తుపాకి చేతికి తీసుకున్నాడు.

 

ఆ తర్వాత అది బొమ్మ తుపాకి అనుకొని వంట గదిలో పని చేసుకుంటున్న తన తల్లిని వెనుకవైపు కాల్చాడు. అయితే బుల్లెట్ తగలటంతో ఆమె తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయింది. అయినప్పటికీ తన భర్తకు సమాచారం ఇవ్వగా హుటా హూటిన అతను ఇంటికి చేరుకొని ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. అయితే మార్గం మధ్యలోనే లారా కన్ను మూసింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

గతంలో కూడా అమెరికాలో ఇటువంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లే విద్యార్థి లైసెన్స్ తుపాకీ పాఠశాలకు తీసుకువెళ్లి టీచర్ ని కాల్చి చంపిన ఘటన కూడా సంచలనం రేపింది. ఆ ఘటన మరువకముందే రెండేళ్ల చిన్నారి తల్లిని చంపిన ఘటన కలకలం రేపుతోంది. ఇలా తెలిసి తెలియని వయసులో చిన్నారి చేసిన పని తెలిసి అందరూ ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -