Unlucky Players: ఈ ఐదుగురు ప్లేయర్స్ దురదృష్టకర ప్లేయర్స్ అని తెలుసా?

Unlucky Players: సినిమాలను ప్రేమించే వారు ఎంతమంది ఉన్నారు అలాగే క్రికెట్ ని కూడా ఇష్టపడేవారు అంతేమంది ఉన్నారని చెప్పవచ్చు. ఇతరుల క్రీడలతో పోల్చుకుంటే ప్రేక్షకులు ఎక్కువగా అభిమానించే వ్యక్తిని మాత్రమే అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. అయితే చాలామంది క్రికెట్ ప్రేమికులు భారత జట్టులో చోటు సంపాదించడం కోసం ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు. కానీ భారతదేశంలో చోటు సంపాదించాలి అంటే కచ్చితంగా టాలెంట్ ఉండాల్సిందే అని చెప్పవచ్చు. అయితే కొంతమంది క్రికెటర్లకు ఎంతో ప్రతిభ ఉన్నప్పటికి, వారికి నిరూపించుకోవడానికి తగిన అవకాశాలు రావడం లేదు. అలా ప్రతిభ, క్రికెట్ పట్ల ఎంతో ఆసక్తి ఉన్నా, కొందరు దురదృష్టం కొద్ది లెజెండరీ క్రికెటర్లుగా ఎదగలేకపోయారు. మరి ఆ అటువంటి ఒక ఐదుగురి ఇండియన్ క్రికెటర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అంబటి రాయుడు 2019 ప్రపంచకప్‌కు ముందు, జరిగిన మ్యాచ్ లలో అద్భుతంగా రాణించాడు. కానీ సెలక్టర్లు త్రీడీ ఆటగాడికి ప్రాధాన్యత ఇస్తూ, రాయుడును జట్టు నుంచి సడెన్ గా తొలగించారు. అయితే ప్రపంచకప్‌లో ఆటగాళ్లకు గాయపడ్డారు. అయినా , స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న రాయుడుని సెలెక్టర్లు జట్టులోకి తీసుకోలేదు. దాంతో రాయుడు కల చెదిరిపోయింది. కరుణ్ నాయర్.. వీరేంద్ర సెహ్వాగ్ తరువాత 2016లో కరుణ్ నాయర్ ఇంగ్లండ్‌ జట్టు పై ట్రిపుల్ సెంచరీ చేసి, ఇండియన్ క్రికెట్ చరిత్రలో రెండో బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. కానీ దురదృష్టం నాయర్ ను వెంటాడింది. ట్రిపుల్ సెంచరీని చేసిన తర్వాత, జట్టులోకి తీసుకోలేదు కానీ ట్రిపుల్ సెంచరీ బాదిన నాయర్‌కు చోటు దక్కలేదు.

 

వసీం జాఫర్.. వసీం జాఫర్ ది లెజెండ్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్ గా పేరు తెచ్చుకున్నాడు. జాఫర్ దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. అతను 186 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ముంబైకి ఆడుతున్న సమయంలో 14609 పరుగులు చేశాడు. అంతే కాకుండా ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 46 సెంచరీలుచేసినప్పటికీ, భారత్ జట్టుకు కఠిన సమయం రావడంతో, ప్లేయర్స్ రొటేషన్స్ లో మారుతుండడంతో అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉన్నప్పటికీ, దురదృష్టం కొద్ది అతను జట్టులో స్థానం కోల్పోయాడు. అలాగే ఇర్ఫాన్ పఠాన్ కూడా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి రికార్డును సృష్టించాడు. 23 ఏళ్ల వయసులో పఠాన్‌ మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తుండడంతో అతనికి జూనియర్ కపిల్ దేవ్ గా పేరు వచ్చింది. అయితే అతనిని దురదృష్టం అనేది గ్రెగ్ చాపెల్ రూపంలో వెంటాడింది.. దినేష్ కార్తీక్ ఈ పేరు వినగానే నిదాహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో అతని బ్యాటింగ్‌ అందరికి గుర్తుకు వస్తుంది. కార్తీక్ దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అతను భారత క్రికెట్ జట్టులో స్థానం పొందలేకపోయాడు. ఓపెనర్ గా మొదటి మ్యాచ్ ఆడటమే అతనికి శాపంగా మారింది. కానీ అప్పటికే జట్టులో సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. దాంతో కార్తీక్ ఎక్కువగా అవకాశాలు రాలేదు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -