Disability Students: దివ్యాంగులకు దూరంగా పరీక్ష కేంద్రాలు.. ఏపీ ఇంటర్ బోర్డ్ అధికారుల తీరు మారదా?

Disability Students: జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కేవలం ఆయన మాత్రమే కాకుండా అధికారులు కూడా వారికి ఇష్టం వచ్చిన విధంగా పాలన కొనసాగిస్తున్నారనే విషయాలు స్పష్టంగా అర్థం అవుతున్నాయి. వారికి ఎవరైనా ఎదురు తిరిగిన వారిపై దాడి చేయడం లేదంటే వారిని మానసికంగా కృంగబాటకు గురిచేయడం వైకాపా నేతలతో పాటు అధికారులకు కూడా అలవాటుగా మారిపోయింది.

మరికొద్ది రోజులలో ఇంటర్ బోర్డు పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలోనే పరీక్షలకు విద్యార్థులు అందరూ కూడా సిద్ధమయ్యారు. అలాగే పరీక్షలకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో పరీక్షలు అంటే విద్యార్థులు పెద్ద ఎత్తున పరీక్షలకు సిద్ధం అయ్యేవారు కానీ ప్రస్తుతం మాత్రం పరీక్ష కేంద్రాల విషయంలో ఎంతో కలవరపాటుకు గురవుతున్నారని తెలుస్తుంది.

అచ్యుతాపురంలో 4 ప్రైవేట్ ఇంటర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఓ కాలేజీలో 302 మంది విద్యార్థులు చదువుతున్నారు. 200 మంది బాలికలు ఉండగా మిగతా బాలురు ఉన్నారు. అయితే ఈ కళాశాలలో దాదాపు 15 మంది విద్యార్థులు అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నారు. వారు చెవిటి మూగ ఇతర అంగవైకల్య సమస్యలతో బాధపడుతున్నారు.

మిగతా కాలేజీలో 900 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఈ తొమ్మిది వందల మంది విద్యార్థులను స్థానికంగా ఉన్న పరీక్ష కేంద్రాలలో సెంటర్లు వేయగా ఆ కళాశాలకు మాత్రమే దాదాపు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొక్కిరాళ్లపల్లి తాళ్లపాలెం గురుకుల పాఠశాలలో పరీక్ష కేంద్రాలుగా నియమించారు. దీంతో అంగవైకల్యంతో బాధపడేవారు అంత దూరం వెళ్లి పరీక్షలు ఎలా రాయగలరు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం అధికారులకు డబ్బు ఇవ్వలేదన్న ఒక కారణంతోనే ఈ విధంగా పరీక్ష కేంద్రాలలో సుదూర ప్రాంతాలకు వేస్తున్నారు. అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -