Land on the Moon: చంద్రుడిపై ఎకరం భూమి విలువ ఎంతో మీకు తెలుసా.. ఎలా కొనుగోలు చేయాలంటే?

Land on the Moon: గత నెలలో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ అయిన విషయం తెలిసిందే. దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ నిలిచి రికార్డ్ ను సృష్టించింది. మొత్తంగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిపిన నాలుగో దేశంగా కూడా అవతరించింది. దీంతో యావత్ ప్రపంచం చూపు చందమామపై పడింది.
దాంతో ప్రతి ఒక్కరూ కూడా చంద్రుడికి సంబంధించిన విషయాలపై ఆరా తీయడం మొదలు పెట్టారు. గడిచిన నాలుగైదు రోజులుగా చందమామపై భూమిని కొనుగోలు చేయాలన్న ఎక్కువగా హాట్ టాపిక్ గా మారడంతో చాలామంది అదే విషయం గురించి చర్చించుకోవడంతో పాటు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు.

మరి చంద్రుడిపై భూమిని ఎలా కొనుగోలు చేయాలి?అక్కడ ఎకరం భూమి విలువ ఎంత ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా చంద్రుడిపై భూమి సమతలంగా ఉండదు. ఎన్నో బిలాలు, రాళ్లతో కూడి ఉంటుంది. భూమిపై మాదిరిగానే చంద్రుడిపై కూడా కొన్ని ఏరియాలు ఉంటాయి. వాటికి కూడా కొన్ని పేర్లను కేటాయించారు. ఇప్పటికే చాలా మంది చంద్రుడిపై భూమిని కొనుగోలు చేశారు. చంద్రుడిపై నివాస యోగ్య పరిస్థితులు నెలకొల్పితే అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రుడిపై భూమిని కొనుగోలు చేసేందుకు ఒక పద్ధతి ఉంటుంది. అదేంటంటే మూన్ ల్యాండ్ ఎలా కొనాలి? లూనా సొసైటీ ఇంటర్‌నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ కంపెనీలు చంద్రుడిపై భూమిని విక్రయిస్తున్నాయి. ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ నుంచి దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కొనుగోలు చేశాడు. చంద్రుడిపై సీ ఆఫ్ ముస్కోవీ ప్రాంతంలో మూన్ ల్యాండ్ కొన్నాడు. షారూక్ ఖాన్‌కి కూడా కొందరు అభిమానులు చంద్రుడిపై భూమిని గిఫ్ట్‌గా ఇచ్చారు. హైదరాబాద్‌కి చెందిన రాజీవ్ బగ్డీ, బెంగళూరుకు చెందిన లలిత్ ఇదే విధంగా భూమిని కొనుగోలు చేశారు. కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకుని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. లూనార్ రిజిస్ట్రీ తెలిపిన వివరాల ప్రకారం చంద్రుడిపై ఎకరం భూమి విలువ 37.50 డాలర్లు. అంటే సుమారు రూ.3,100. ఇంత తక్కువ ధర ఉండటంతో చంద్రుడిపై భూమిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. లూనార్ రిజిస్ట్రీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న అనంతరం సంబంధిత ధ్రువపత్రాలు పొందవచ్చు. అయితే కేవలం డాలర్ల రూపంలోనే ట్రాన్సాక్షన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కొనుగోలు చేయాలని భావించే వారు కరెన్సీని మార్చుకోవాలి. క్రెడిట్, డెబిట్ కార్డులతో ట్రాన్సాక్షన్ పూర్తి చేయవచ్చు. అయితే, చంద్రుడిపై భూమి కొన్న వారికి కొన్ని షరతులు వర్తిస్తాయి. 1967లో చేసుకున్న ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం భూమిపై ఆవల ఉన్న ఏ ప్రాంతంపైనైనా ఒక వ్యక్తికి గాని, ఒక దేశానికి గాని యాజమాన్య హక్కులు ఉండబోవు. ఈ ఒప్పందంపై భారత్‌తో పాటు 110 ఇతర దేశాలు సంతకం చేశాయి. ఈ ఒప్పందం మేరకు భూమి ఆవల ఎక్కడ, ఎవరు కొనుగోలు చేసినా వారి పేరు మీద ఉంటుంది తప్ప చట్టపరంగా ఓనర్‌షిప్ వర్తించదు. అయితే, చంద్రుడిపై పూర్తిగా నివాస యోగ్య పరిస్థితులు నెలకొనడానికి ఇంకా చాలా ఏళ్లు పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -