Bangles: పెళ్లయిన స్త్రీలు గాజులు ధరించకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Bangles: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో చాలామంది సంప్రదాయాలను మర్చిపోవడంతో పాటు కట్టుబాట్లను కూడా పక్కన పెట్టేశారు. మరి ముఖ్యంగా స్త్రీలు అయితే గాజులు వేసుకోవడం, పట్టీలు పెట్టుకోవడం, పెళ్లయిన వివాహితలు తాళిబొట్టు ధరించడం లాంటివి పూర్తిగా తగ్గించేశారు. ఏదైన ఫంక్షన్ లు పండుగలు శుభకార్యాలు జరిగిన సమయంలో మాత్రమే ఆభరణాలు ధరించడానికి ఇష్టపడుతున్నారు. కాగా చాలామంది పెళ్లైన వివాహితలు గాజులు వేసుకోవడం మర్చిపోతున్నారు. కొంతమంది కావాలనే వాటిని ధరించకుండా ఏదైనా అడిగితే ఫ్యాషన్ అని అంటున్నారు.

లక్ష్మీస్వరూపంగా భావించే ఆడపిల్ల చేతినిండా గాజులు వేసుకుంటే గలగల శబ్దానికి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుతారని నమ్మకం. అయితే స్త్రీలు గాజులు వేసుకోవడం వెనుక అందం, సెంటిమెంట్స్ మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గాజులు వేసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది. పనులు చేస్తున్నప్పుడు మణికట్టు ప్రదేశంలో ఉన్న గాజులు పైకి, కిందకు కదలడం వల్ల రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. గాజులు వేసుకుని పనిచేసే మహిళలు తొందరగా అలసటకు గురికారు.

 

గాజుల ధరించినవారికి ఒత్తిడిని భరించే శక్తి లభిస్తుంది.. అలాగే మట్టి గాజులు వేసుకుంటే శరీరంలో వేడిని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకనే ఎన్ని బంగారం గాజులు వేసుకున్నా కనీసం రెండైనా మట్టి గాజు చేతికి ఉండాలని పెద్దలు చెబుతుంటారు.
మహిళల శరీరం మగవారితో పోల్చితే చాలా సున్నితంగా ఉంటుంది. దీంతో హార్మోన్లు అసమతౌల్యత గురవుతూ ఉంటాయి. అందుకే గాజులు వేసుకోవడం వల్ల వాటి స్థాయి బ్యాలన్స్ డ్ ఉంటుంది. ప్రస్తుతం చాలామంది అమ్మాయిలకు హార్మోన్ల అసమతౌల్యత వల్లే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. సీమంతం చేసినప్పుడు గర్భిణులకు గాజులు వేసి ప్రసవం అయ్యేవరకూ ఉంచుకోవాలని చెబుతారు. గర్భం ధరించిన వారికి ఐదో నెల తర్వాత పెరిగే బిడ్డ బరువు వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రసవ వేదనని భరించే శక్తి ఉంటుందని భావించేవారు. సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సంప్రదాయం చెబుతోంది. చేతినిండా గాజులు వేసుకోపోయినా, బంగారం వేసుకున్నా కానీ మట్టి గాజులు రెండైనా కానీ తప్పనిసరిగా ఉండాలి.శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు, కుంకుమతో పాటు గాజులు పెట్టి పూజించడం, ముత్తైదువలకు అందించడం ఆచారంగా వస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -