Twin Bananas: జంట అరటిపండ్లను తింటే నిజంగానే కవలపిల్లలు పుడతారా.. వాళ్లకు ఈ పండ్లు పెడితే అరిష్టమా?

Twin Bananas: మామూలుగా మనకు మార్కెట్లో దొరికే రకరకాల పండ్లు కొన్ని కొన్ని సార్లు రెండు కలిపి అతుక్కొని వస్తూ ఉంటాయి. వాటిని కవల పండ్లు అని కూడా కొన్ని ప్రదేశాలలో పిలుస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా మనకు రెండు కలిపి ఒకే విధంగా రావడం ఎక్కువ అరటిపళ్ళల్లో చూస్తూ ఉంటాం. చాలామంది ఇలా జంట అరటి పండ్లను తింటే కవల పిల్లలు పుడతారని చెబుతూ ఉంటారు. అయితే నిజంగానే జంట అరటి పండ్లను తింటే కవల పిల్లలు పుడతారా. ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం… కవల అరటి పండ్లని పిల్లలు తినకూడదు. పెద్దలు తింటే కవల పిల్లలు పుడతారు.

అలాగే దేవుడికి కూడా ఇటువంటి అరటి పండ్లను పెట్టకూడదని అంటూ ఉంటారు. అరటి చెట్టు అంటే ఎవరో కాదు. సాక్షాత్తూ దేవ నర్తకి రంభ అవతారం. మహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని, అహంకారపూరితంగా వ్యవహరించడం వలన ఆమెని భూలోకంలో అరటి చెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపిస్తాడు. రంభ తన తప్పును తెలుసుకుని ప్రాధేయపడడంతో దేవుడికి నైవేద్యంగా ఉండే అర్హతని ఆమెకి ఇచ్చాడు. అంత పవిత్రమైన అరటిపండ్లలో ఎటువంటి దోషాలని కూడా ఎంచక్కర్లేదు.కవల అరటి పండ్లను దేవతలకి పెట్టవచ్చు. అందులో తప్పులేదు.

కానీ తాంబూలంలో మాత్రం ఇటువంటి అరటి పండ్లను పెట్టకూడదు. ఎందుకంటే ఇవి రెండు పండ్లు అయినా కూడా ఒక పండు కిందే లెక్క వస్తాయి. పైగా చాలా మంది కవల పిల్లలు పుడతారని మంచిది కాదని అంటూ ఉంటారు. అటువంటప్పుడు మనం పెట్టడం వలన ఇతరులకి నచ్చకపోవచ్చు. కాబట్టి తాంబూలంలో పెట్టకుండా ఉండడమే మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -