Hanuman chalisa: రాత్రి సమయంలో హనుమాన్ చాలీసా చదివితే అలా జరుగుతుందా.. ఆ తప్పులు చేయొద్దంటూ?

Hanuman chalisa: మామూలుగా చాలామంది హనుమంతునికి పూజ చేసేటప్పుడు భయం కలిగినప్పుడు ఇలా రకరకాల సందర్భాలలో హనుమాన్ చాలీసా అని చదువుతూ ఉంటారు. హనుమాన్ చాలీసాని పఠించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి హనుమాన్ చాలీసాని చదివితే ఎటువంటి లాభాలను పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులసీ దాస్ అందించిన హనుమాన్ చాలీసాని చాలా మంది చదువుతూ ఉంటారు. హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం కూడా ఉంది.

హనుమంతుడిని మెప్పించిన హనుమాన్ చాలీసాని చదవడం వలన శని ప్రభావం ఉండదు. అలాగే హనుమాన్ చాలీసాని పటించడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. హనుమాన్ చాలీసా చదవడానికి, ఒక పద్ధతి కూడా ఉంది. ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం కూడా ఉంది. హనుమాన్ చాలీసా చదివితే, ఆ వ్యక్తిపై అద్భుత ప్రభావం పడుతుంద‌ని అంటారు. పొద్దున్న కానీ రాత్రి కానీ హనుమాన్ చాలీసా చదవచ్చు. ఈ సమయాల్లో హనుమాన్ చాలీసా చదివితే, చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. శని ప్రభావం ఉన్న వాళ్లు, ప్రతిరోజూ రాత్రి హనుమాన్ చాలీసాని ఎనిమిది సార్లు చదివితే, చక్కటి ఫలితం కనిపిస్తుంది.

 

8 సార్లు హనుమాన్ చాలీసాని చదవడం వలన పాపాలు తొలగిపోతాయి. రాత్రిళ్ళు హనుమాన్ చాలీసా చదివితే, దుష్టశక్తుల నీడ మీపై నుండి తొలగిపోతుంది. మీ పిల్లలకి దెయ్యాలపై భయం ఉంటే, హనుమాన్ చాలీసా చదవడం మంచిది. అప్పుడు ఎటువంటి భయాలు ఉండవు. హనుమాన్ చాలీసా చదివితే, హనుమంతుడు మీ కష్టాల నుండి మిమ్మల్ని బయటపడేస్తాడు. ఏదైనా పనిలో విజయాన్ని సాధించాలనుకుంటే, మంగళవారం, గురువారం, శనివారం లేదా మూల నక్షత్రం ఉన్న రోజుల్లో రాత్రి పూట హనుమాన్ చాలీసాని 108 సార్లు చదివితే చాలా మంచిది. ఇలా హనుమాన్ చాలీసాని చదవడం వలన చక్కటి ఫలితం కనపడుతుంది. కష్టాలన్నీ పోతాయి. భయం ఏమీ ఉండదు. ఇబ్బందుల నుండి బయటపడ‌వ‌చ్చు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -