Donald Trump: హిందూత్వ ఎజెండా మాదిరిగానే ట్రంప్.. ఆ మతం వాళ్లను దుర్మార్గులుగా చూస్తున్నారా?

Donald Trump: కొందరు మోడీ అజెండా అంటే మరికొందరు ఆరెస్సెస్ ఎజెండా అని అంటుంటారు. కానీ మొత్తానికి హిందూత్వ ఎజెండా అనే మాట ద్వారా మన దేశంలో విస్తృతమైన విషప్రచారం నడుస్తూ ఉంటుంది. ముస్లిం మతానికి చెందిన ప్రతి ఒక్కరూ కూడా దుష్టులు దుర్మార్గులు లాగా ప్రచారం చేసే వ్యూహం అది అని చెప్పవచ్చు. ముస్లింలను దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ తద్వారా వారి పట్ల హిందూ సమాజంలో భయాన్ని, అసహ్యాన్ని పెంచాలనే కుట్ర అది. ముందు ముస్లిం మతస్తుల పట్ల మిగిలిన సమాజంలో ఒక భయాన్ని పెంచగలిగితే ఆ తర్వాత, సదరు ముస్లింలను కంట్రోల్ చేయగలిగేది ఒక్క బీజేపీ మాత్రమే అనే మాటప్రచారం చేసుకుంటూ భయపడే వారి ఓట్లను గంపగుత్తగా ఎప్పటికీ దక్కించుకుంటూ ఉండవచ్చు అనేది ఒక వర్గం వారి ఆలోచన.

అయితే బీజేపీ అనుకూలంగా పనిచేసే వారు కూడా ఇలాంటి భావాలనే వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నిత్యం సోషల్ మీడియాలో, వాట్సప్, ఫేస్ బుక్ గ్రూపుల్లో ఇలాంటి చండాలాల్ని మనం అనేకం చూస్తూనే ఉంటాము. ఇకపోతే వర్తమానంలోకి వస్తే.. అమెరికా అధ్యక్షుడుగా పోటీచేయాలని అనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ కూడా అచ్చంగా ఈ హిందూత్వ మార్గాన్నే అనుసరించాలని అనుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముస్లిం వ్యతిరేక భావాలను ప్రచారం చేసుకోవడం ద్వారా దేశంలోని ప్రజల ఓట్లను గంపగుత్తగా పొందడం సాధ్యం అవుతుందని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.

తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే ముస్లిం దేశాల నుంచి అమెరికాకు పౌరుల రాకపోకలపై నిషేధాన్ని పునరుద్ధరిస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రిపబ్లికన్ యూదు కూటమి సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇరాన్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్, ఇరాక్, సూడాన్ వంటి దేశాలకు చెందిన మామూలు ప్రజలు కూడా అమెరికాలో అడుగు పెట్టకుండా ట్రప్ తన పదవీకాలంలో ఆంక్షలు విధించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -