Dream Facts: ఆ సమయంలో వచ్చే కలలు నిజమవుతాయా.. ఇందులో నిజమెంత?

ప్రతి ఒక్క మనిషికి నిద్రపోయినప్పుడు కలలు రావడం అన్నది సహజం. అయితే చాలామంది పీడకల్లో వచ్చినప్పుడు భయపడటం, మంచి కలలు వచ్చినప్పుడు సంతోషపడడం లాంటివి చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు భయంకరమైన కలలు వచ్చినప్పుడు అటువంటివి జరుగుతాయేమో అని అనుకుని మరింత భయపడుతూ ఉంటారు. అయితే కలలో కొన్ని నిజమవుతాయి అని అంటూ ఉంటారు. అయితే రాత్రి సమయంలో లేదా తెల్లవారుజామున వచ్చే సమయంలో కలలో నెరవేరుతాయి అని చెబుతూ ఉంటారు. కానీ కలలు ఏ సమయంలో వస్తే నిజం అవుతాయి అన్న విషయం పై చాలా మందికి సరైన అవగాహన లేదు.

మరి ఈ కలల విషయంలో స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?ఏ సమయంలో వచ్చి కలలు నిజమవుతాయి? అన్న వివరాల్లోకి వెళితే.. మనం నిద్రపోయినప్పుడు వచ్చే కలలో భవిష్యత్తులో జరిగే మంచి చెడు సంఘటన సూచిస్తాయి అని ప్రజలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అయితే రాత్రి వేళ వేర్వేరు సమయాల్లో వచ్చే కలల ఫలం వివిధ సమయాల్లో లభిస్తుందని స్వప్న శాస్త్రంలో కూడా పేర్కొన్నారు. స్వప్న శాస్త్రం ప్రకారం, రాత్రి 1, 2 గంటల మధ్య కనిపించే కలల ఫలాలు సాధారణంగా ఒక సంవత్సరంలో నెరవేరుతాయట. అలాగే రాత్రి 3, 4 గంటల మధ్య వచ్చే కలలు త్వరగా నిజం అవుతాయని జనాలు విశ్వసిస్తూ ఉంటారు. అయితే స్వప్న శాస్త్రం కూడా అదే చెబుతుంది.

రాత్రి 3,4 సమయంలో కనిపించే కలలు 6 నెలల్లో నిజం అవుతాయట. రోజూ ఉదయం 4 నుంచి 5 మధ్య వచ్చే కలలు నిజమవుతాయట. మత గ్రంథాలలో ఈ సమయాన్ని అమృత్‌బెల్ల, చంద్రబెల్లా, బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు. ఈ సమయంలో భూమిపై ఉన్న విషయాలు దైవిక శక్తులచే ప్రభావితం అవుతాయి అని చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో వచ్చిన కలలు 3 నెలల్లో నిజమవుతాయని నమ్మకం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -