Dengue: చర్మంపై రక్తపు దద్దుర్లు వస్తే ఇంత ప్రమాదమా.. డెంగీ వ్యాధికి సులువుగా చెక్ పెట్టే చిట్కాలివే!

Dengue: రాష్ట్రంలో మళ్లీ డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పరిస్థితి చేజారి క్రమంగా మృత్యువాత పడుతున్నారు డెంగీ పేషెంట్లు. అందుకే డెంగీ మీద కొంచెం అవగాహన పెంచుకుందాం. లేడీస్ ఈజిప్ట్ దోమల వల్ల డెంగీ సోకుతుంది. అప్పటికే డెంగీ సోకిన వ్యక్తిని కుట్టిన దోమ ఇతరులని కుట్టడం ద్వారా వారికి కూడా ఈ వైరస్ అంటుకుంటుంది. నాలుగు నుంచి ఏడు రోజుల్లో జ్వరం తాలుకు లక్షణాలు బయటపడతాయి.

101° నుంచి 104° జ్వరం రావటం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తీవ్ర నడుము నొప్పి తదితర లక్షణాలు ఉంటే డెంగీగా అనుమానించాలి. వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. డెంగీ జ్వరం ఉన్నది లేనిది తెలియాలంటే ఐ జి ఏం తోనే సాధ్యపడుతుంది. డెంగీ సోకిన వ్యక్తులకి డెంగీ హేమరేజిక్, డెంగీ షాక్ సిండ్రోమ్ లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్ కి తరలించండి. వీళ్ళకి ఎక్కువగా రక్తనాళాల్లో ద్రవాలు లీకేజీ ఉంటుంది కాబట్టి కొబ్బరి నీళ్ళు పండ్ల రసాలు, ఓఆర్ఎస్ వంటివి వెంట వెంటనే ఇస్తూ ఉండండి.

ప్లేట్లెట్లు తగ్గడం కంటే క్యాపెల్లర్ లీకేజీ తోనే ఎక్కువ ప్రమాదం. దీనివలన బీపీ, పల్స్ పడిపోయి మెదడు, గుండె, కాలేయం, మూత్రపిండాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. వెంటనే రోగి షాక్ లోకి వెళతారు. అంటే ఆ పేషంట్ కి అత్యవసర చికిత్స అవసరమని అర్థం. తీవ్రమైన తలనొప్పి, పొట్టలో నొప్పి, శరీరంపై దద్దుర్లు వేధిస్తుంటే వెంటనే షాక్ సిండ్రోమ్ గా భావించి రోగులని హాస్పిటల్ కి తరలించాలి. ఎక్కువగా స్త్రీలు, పిల్లలు, గర్భిణీలు అలాగే గుండె, కిడ్నీ, మధుమేహం వ్యాధులతో బాధపడుతున్న వారు దీనిపై మరింత అప్రమత్తతని కలిగి ఉండాలి.

అలా అని చెప్పి పెయిన్ కిల్లర్లు వాడేయకండి. ఇది చాలా ప్రమాదం దీని వలన ప్లేట్ లెట్లు వేగంగా తగ్గిపోతాయి. కాబట్టి సొంత వైద్యం చేయకండి. అలాగే గుండె సమస్య ఉన్నవారు రక్తం చిక్కబడకుండా మందులు వాడుతారు. అలాంటివారు డెంగీ సోకిన వెంటనే ఆ మందులు ఆపేసి వెంటనే వైద్యుడిని సంప్రదించండి. తరువాత ఇంట్లోకి దోమలు రాకుండా తగిన నివారణ చర్యలు తీసుకోండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -