LakshmanaPhal: లక్ష్మణ ఫలం తినడం వల్ల ఏకంగా ఇన్ని లాభాలా.. ఆ క్యాన్సర్లకు చెక్ పెట్టవచ్చా?

LakshmanaPhal: ప్రకృతి మనకు ఎన్నో రకాల పండ్లను ప్రసాదించిన విషయం తెలిసిందే. అటువంటి వాటిలో లక్ష్మణ ఫలం కూడా ఒకటి. చాలామంది ఈ పండు పేరుని కూడా చాలా తక్కువగా వినే ఉంటారు. ఈ లక్ష్మణ ఫలం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. భారతదేశంలో అధికంగా సీతాఫలం మరియు రామాఫలం తింటారు వాటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా మందికి తెలుసు. ఇది మన దేశంలో పండే పండు కాదు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పండు దీనిలో పోషక విలువలు అద్భుతంగా ఉంటాయి.

ముఖ్యంగా క్యాన్సర్, టీవీ, ఎయిడ్స్ లాంటి వ్యాధులు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుందట. ఈ లక్ష్మణ ఫలం మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. అక్కడి నుంచే భారత దేశంలోకి దిగుమతి చేసుకుంటారు ముఖ్యంగా ఇది అడవి ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. తద్వారా జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇది 12 రకాల క్యాన్సర్ వ్యాధులను రాకుండా అడ్డుకుంటుంది. ఈ లక్ష్మణ ఫలంలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను సక్రమంగా ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా మలబద్ధకం లాంటి సమస్యలతో బాధపడే వారికి ఈ పండు ఒక దివ్యౌషధం దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.

 

కాబట్టి పొట్ట సంబంధిత సమస్యలు ఏవీ రాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో రైబోఫ్లెవిన్ అధికంగా ఉంటుంది. దీంతో రక్తహీనత సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఇది తీసుకోవడం ద్వారా రక్తహీనత తగ్గిస్తుంది. ముఖ్యంగా నోటిలో ఉండే రోగాలు అడ్డుకట్ట వేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. నోట్లో పుండ్లు, చిగుళ్ల నుంచి రక్తం కారడం జరుగుతూ ఉంటే కనుక తప్పనిసరిగా ఈ ఫలం యొక్క గుజ్జుని తీసుకొని ఆ ప్రాంతంలో పెడితే త్వరగా మానిపోతాయి. ఊబకాయంతో బాధపడే వారికి ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించడంలో మంచి కొవ్వు పెంచడంలో గుండె ఆరోగ్య పనితీరులో ఎంతగానో సహాయపడుతుంది.

 

ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగరీత్యా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు అటువంటి వారికి ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది లక్ష్మణ ఫలం లో ట్రిప్టోఫాన్ అని పదార్థం ఉంటుంది దీనితో నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి చక్కటి నిద్ర వస్తుంది..ఇందులో విటమిన్ డి, కాపర్, జింక్, మెగ్నీషియం అన్నీ విరివిగా ఉంటాయి దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి. ఎక్కువగా ఆయాస పడేవారు ఈ పండును తీసుకోవడం కారణంగా అతి త్వరగా శరీరంలో శక్తిని పుంజుకుంటారు. ఏ పనైనా చాలా తేలికగా చేస్తారు. దీనిలో పొటాషియం క్యాల్షియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి వీటి కారణంగా నొప్పులు లాంటి సమస్యలు శరీరంలో లేకుండా చేస్తుంది. కొంతమంది మూత్రాశయ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు ఈ లక్ష్మణ ఫలం తీసుకోవడం ద్వారా యూరినరీ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు.

 

Related Articles

ట్రేండింగ్

Raghu Rama Krishnam Raju: ఉండిపై ఉడుం పట్టు పట్టిన రఘురామ కృష్ణంరాజు.. అసెంబ్లీలో జగన్ కు వణుకేనా?

Raghu Rama Krishnam Raju: రఘురాం కృష్ణంరాజు కి కూటమి తరపున టికెట్ రాదు అనే భావించిన వైసీపీ వర్గం వారు సంబరాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అనూహ్యంగా తెదేపా...
- Advertisement -
- Advertisement -