Asaduddin Owaisi-PM Modi: ముస్లింలే ఎక్కువ కండోమ్స్ వాడుతున్నారు.. వైరల్ అవుతున్న అసరుద్దీన్ ఒవైసీ కౌంటర్!

Asaduddin Owaisi-PM Modi:  మొదటి దశ ఎన్నికల పోలింగ్ తరువాత రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ క్రమంలో ఆయన ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై ముస్లిం నేత, ఎంపీ అసురుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.

ముస్లింలను బూచిగా చూపించి హిందువులను ఎందుకు భయపడుతున్నారని, రాజకీయ లబ్ది కోసం ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముస్లింలకు ఎక్కువమంది పిల్లలు ఉంటారని మోడీ అంటున్నారు కానీ ఎక్కువ కండోమ్స్ ముస్లింలే వాడతారని కౌంటర్ ఇచ్చారు. ముస్లింలు ఎక్కువమంది పిల్లలను కంటారనే భయాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు.

నరేంద్ర మోడీకి ఆరుగురు సోదరులు, అమిత్ షాకు ఆరుగురు సోదరీమణులు అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కి పదిమంది సోదరీమణులు ఉన్నారు.మోడీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ముస్లింల జనాభా పెరుగుదల, సంతాన ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. ముస్లింలు కండోమ్ లు ఎక్కువగా వాడతారని చెప్పటానికి నాకు సిగ్గుగా లేదు, ముస్లింలు మెజారిటీ వర్గం అవుతారని నరేంద్ర మోడీ హిందువులలో భయాన్ని పెంచుతున్నారు.

మా మతం వేరు కానీ మేము భారతీయులం అని ఓవైసీ చెప్పుకొచ్చారు. ముస్లింల వల్లే దేశంలో సంతాన ఉత్పత్తి పెరుగుతుందని చెప్పడం చూస్తుంటే ముస్లిం జనాభా లేకుండా చేయాలని ఆలోచన ప్రదానికి ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వగురు,దేశం కోసం పోరాటం చేస్తున్నామని చెబుతున్న ప్రధాని మోడీ క్విట్ ఇండియా ఉద్యమం, కాలాపాని సమయంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాడింది ఎవరో తెలుసుకొని మాట్లాడాలన్నారు.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాని మోదీ ప్రజలకు తప్పుడు సంకేతం ఇస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఉన్న 17 కోట్ల మంది భారతీయ ముస్లింలను చొరబాటుదారులు అంటున్నారు. దళితులు, ముస్లింల పట్ల ద్వేషమే మోదీ అజెండాల కనిపిస్తుంది, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో చిచ్చుపెట్టడానికే భాజపా ప్రయత్నిస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఓవైసీ.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -