Varanasi: క‌రెంట్ షాక్‌తో నీటిలో కొట్టుకున్న నాలుగేళ్ల చిన్నారి.. ప్రాణాలకు తెగించి కాపాడిన వృద్ధుడు!

Varanasi: సాధారణంగా కరెంట్ షాక్ కొడితే మనం ఈ షాప్ నుంచి బయటపడటం చాలా గగనం ఇలా కరెంట్ షాక్ కారణంగా కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవాల్సి కూడా ఉంటుంది. అయితే ఉత్తరప్రదేశ్లో నాలుగేళ్ల చిన్నారి ఈ విధమైనటువంటి కరెంటు షాక్ కి గురయ్యారు అయితే ఓ వృద్ధుని మాత్రం ధైర్యం చేసే ఆ చిన్నారిని ప్రాణాలతో కాపాడిన తీరు అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది ఏంటి అనే విషయానికి వస్తే…

ఉత్తరప్రదేశ్ వారణాసిలోని నాలుగు సంవత్సరాల బాలిక కరెంట్ వైర్ తగిలి రోడ్డుపై పడింది అయితే రోడ్డులో నీళ్లు ఉండటం వల్ల ఆ బాలిక కరెంటు షాక్ కి కొట్టుమిట్టాడుతుంది అయితే అక్కడ ఉన్నటువంటి వారు ఆమెకు సహాయం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అక్కడే ఉన్నటువంటి ఒక వృద్ధుడు చాలా ధైర్యంగా ముందుకు వచ్చి చాకచక్యంగా ఆ చిన్నారిని ప్రాణాలతో కాపాడారు.

రోడ్డుపై నీళ్లు ఉండటం వల్ల కరెంటు షాక్ కారణంగా ఆ చిన్నారి బయటకు రాలేకపోయింది. దీంతో ఆ వృద్ధుడు ఒక చెక్క కర్ర తీసుకొని చిన్నారి ముందుకు వచ్చి ఆకర్ర తనని పట్టుకోమని చెప్పారు.. మరో వైపు నుంచి కర్ర సహాయంతో చిన్నారిని ఆ నీటి నుంచి అలాగే వైర్ కింద నుంచి జాగ్రత్తగా బయటికి లాగేసారు. ఇలా ఆ వృద్ధుడు సమయస్ఫూర్తితో చిన్నారిని ఈ ప్రమాదం నుంచి కాపాడారని తెలుస్తుంది. ఇక ఈ ఘటన అక్కడ ఉన్నటువంటి సీసీటీవీలో రికార్డు కావడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఈ విధంగా అభివృద్ధిలో చిన్నారిని ప్రాణాలతో కాపాడటంతో ప్రతి ఒక్కరూ ఈయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైరును పట్టుకున్న స్తంభాన్ని నగరంలోని విద్యుత్ గ్రిడ్ మెయిన్ లైన్‌కు అక్రమంగా అనుసంధానించారని తెలిపారు. విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ వైరును తొలగించే సంబంధిత వ్యక్తుల పట్ల కేసులు కూడా నమోదు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -