Over Exercising: అతిగా వ్యాయమం చేస్తున్నారా.. అయితే జాగ్రత్త?

Over Exercising: ప్రతిరోజు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వ్యాయామం చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు అందంగా కూడా ఉంటుంది. వ్యాయామం చేయడం మంచిదే కానీ శృతి మించిన వ్యాయామం వల్ల అనేక రకాల సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. ఎందుకంటె వ్యాయామం శృతి మించినప్పుడు నోరు ఎండిపోవడం, శరీరం చల్లగా అయిపోవడం, ఆయాసం, కొన్ని శరీర భాగాలు వణకటం, వికారం కలుగడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.

ఈ లక్షణాలు వచ్చేవరకు వ్యాయామం చేయడం చాలా ప్రమాదకరం. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపివేయడం మంచిది. వ్యాయామం చేసేటప్పుడు మధ్యమధ్యలో కొన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు తాగకుండా కొంచెం రిలాక్స్ అయిన తర్వాత తాగడం మంచిది. చాలామంది పురుషులు రాత్రి సమయంలో మద్యం జీవించి ఉదయాన్నే అతి వ్యాయామం చేస్తూ ఉంటారు. అలా చేయడం అస్సలు మంచిది కాదు. వ్యాయామం ఇది మితిమీరితే దీర్ఘకాలికంగా అనర్ధాలకు దారి తీయడంతో పాటు కొన్ని కొన్ని సార్లు ప్రాణాల మీదకు కూడా రావచ్చు.

 

దాంతో పాటు బరువు పెరగడం, కండరాల నొప్పి, నిద్రలేమి, గుండె వేగంగా కొట్టుకోవడం, మానసిక సమస్యలు లాంటివి కలుగుతాయి. కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలంటే పరిమితమైన వ్యాయామం మాత్రమే చేయాలి. వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికొస్తే..మన శరీరపు బరువును నియంత్రించడానికి, కండరాలను దృఢంగా శక్తివంతంగా ఉంచడానికి, ఎముకలను బలంగా చేయడానికి, వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. ప్రతిరోజు వ్యాయామం వలన అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించవచ్చును.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -