Anand Mahindra: ఆనంద్ మహీంద్రాపై చీటింగ్ కేసు.. నా కొడుకు చావుకు ఆయనే కారణమంటూ?

Anand Mahindra: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర సంస్థలపై ఓ వ్యక్తి కేసు నమోదు చేశారు. తన కుమారుడు మరణించడానికి ఆనంద్ మహేంద్ర కారణమంటూ కాన్పూర్ కి చెందినటువంటి ఒక వ్యక్తి పోలీస్ కేసు నమోదు చేయడం గమనార్హం. అసలు ఆ వ్యక్తి కొడుకు చనిపోవడానికి ఆనంద్ మహేంద్రకు సంబంధం ఏమిటి ఆయనపై పోలీస్ కేసు పెట్టడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన రాజేష్ మిశ్రా అనే వ్యక్తి 2020 వ సంవత్సరంలో తన కుమారుడు అపూర్వ్ కు ఒక బ్లాక్ స్కార్పియో కొనిచ్చారు. అయితే ఈ స్కార్పియో ప్రమాదానికి గురై తన కుమారుడు మరణించడంతో తన కొడుకుకు కారణం ఆనంద్ మహేంద్ర అంటూ ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.17.39 లక్షల రూపాయలతో కొనుగోలు చేసి ఈ కారును కొనుగోలు చేశారు అయితే 2022వ సంవత్సరంలో ఈ కారు ప్రమాదానికి గురైంది.

2022 జనవరి 14వ తేదీ అపూర్వ్ లక్నో నుంచి కాన్పూర్ తిరిగి వస్తున్నటువంటి సమయంలో ప్రమాదం జరిగింది పొగ మంచు ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డు సరిగా కనిపించకపోవడంతో కారు డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టింది అయితే ఈ సమయంలో ఎయిర్ బాగ్స్ ఓపెన్ కాకపోవడంతో అపూర్వ్ అక్కడికక్కడే మృతి చెందారు. కారు ప్రమాదానికి గురైన తర్వాత ఆ కారును సర్వీసింగ్ కి తీసుకెళ్లగా అక్కడ కారులో ఉన్నటువంటి లోపాలను వెల్లడించారు.

తన కుమారుడు సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నప్పటికీ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదని, ఆ కారులో ఎయిర్ బ్యాగ్స్ లేవని ఆరోపణలు చేశారు.భద్రతలో స్టార్ రేటింగ్ కలిగిన కారులో ఎయిర్ బ్యాగులు ఎందుకు లేవంటూ కారు కొనుగోలు చేసిన డీలర్‌షిప్‌ దగ్గర ప్రశ్నించాడు. దీంతో ఉద్యోగులు రాజేష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బందితోపాటు ఆనంద్ మహేంద్రతో కలిపి మొత్తం 12 మంది పై ఈయన కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఆనంద్ మహేంద్రా స్పందించడం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -