Gaddi Chamanthi: ఈ ఆకు పిసికి జుట్టుకు రాస్తే జుట్టు నల్లగా అవుతుందా.. అసలేం జరిగిందంటే?

Gaddi Chamanthi: ప్రకృతి మనకు ఎన్నో రంగాల ఔషధ మొక్కలను ఇచ్చింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. వాటిలో గడ్డి చామంతి మొక్క కూడా ఒకటి. ఈ గడ్డి చామంతిని ఒక్కో దేశంలో ఒకలాగా పిలుస్తూ ఉంటారు. కొన్ని ప్రదేశాలలో నల్లారం అని పిలిస్తే మరికొన్ని ప్రదేశాలలో చిట్టి చేమంతి అని పిలుస్తారు. అయితే చిన్నతనంలో ఈ గడ్డి చేమంతిని మనం పలకలు నల్లబోర్డును శుభ్రం చేయడానికి ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. పల్లెటూర్లలో అయితే దీనిని పలకలాకు అని పిలుస్తారు.

పల్లెటూరు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా ఈ మొక్క మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్క సన్నపాటి రేకులతో పసుపు పచ్చని పూలతో అందంగా కనిపిస్తుంది. ఈ మొక్కలో అనేక ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయుర్వేదంతో మనిషి వాత, పిత్త, కఫ సంబంధ రుగ్మతలతో రోగాల బారిన పడతారని విశ్లేషణ. వీటన్నికి మంచి చికిత్స మన ఆయుర్వేదం. దెబ్బ తగిలిన చోట ఏర్పడిన గాయానికి గడ్డి చామంతి ఆకుల రసాన్ని అప్లై చేస్తే అది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. అంతేకాదు రకాల చర్మ వ్యాధులకు ఈ ఆకు రసాన్ని ఇప్పటికీ అనేక ప్రదేశాల్లో వాడుతూనే ఉన్నారు.

కొన్ని పల్లెటూర్లలోని రైతులు గడ్డి చామంతిని పశువుల గాయాలు, పుండ్లకు వైద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కను ఎగ్జిమా నివారణకు శక్తిమంతంగా ఉపయోగించవచ్చని పలు పరిశోధనల్లో వెల్లడైంది. సాంప్రదాయకంగా గడ్డి చామంతిని శరీరంపై ఏర్పడిన గాయాలను నయం చేయడానికి అనేక రకాల ఉపశమనానికి చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో యాంటీ కోగ్యులెంట్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తాయి.

చర్మ అంటు వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారికి దీని ఆకు రసం మంచి ఔషధం. అంతేకాకుండా చాలామంది తెల్ల జుట్టు సమస్యలు, జుట్టు చిట్లి పోవడం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి వారు ఈ ఆకు రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత జుట్టు కొంచెం తడిగా చేసుకుని ఈ ఆకు రాసాన్ని తలకు పట్టించి ఆ తర్వాత 15 నిమిషాలు ఆరనిచ్చి ఆపై స్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒక మూడు సార్లు చేయడం వల్ల జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలు నయం అవుతాయి. అంతే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: తొలి విడత డబ్బు పంపిణీ దిశగా వైసీపీ అడుగులు.. కోట్లు చేతులు మారుతున్నాయా?

YSRCP: సాధారణంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ప్రచార కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలకు మందు, భోజనంతో పాటు రోజువారీ కూలీ కూడా డబ్బులను కూడా అందజేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే కూటమి చేతిలో...
- Advertisement -
- Advertisement -