The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము ఉన్న పెద్దగా పట్టించుకునే వారు కాదు కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలపై పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కటి ఆన్లైన్ విధానం కావడంతో రాత్రికి రాత్రే భూములు చేతులు మారుతున్నాయి భూ యజమానులు మారుతున్నారు.

స్థలాలకు సంబంధించి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి భూ యజమానులు మారుతున్నటువంటి ఘటన ఇటీవల ఒంగోలులో బయటపడింది అయితే ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్నప్పటికీ కొందరి బెదిరింపులు కారణంగా ప్రాణభయం కారణంగా ఈ విషయాలను బయట పెట్టడం లేదు. ఒకవేళ బయటకు వచ్చిన తమకు న్యాయం జరగదన్న నమ్మకం ప్రజలలో బలంగా నాటుకుపోయింది అందుకే మౌనం వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారెంటీ యాక్ట్- 2022ను తీసుకొచ్చింది. సాంకేతికంగా 2023 అక్టోబరు 31 నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త చట్టం ప్రకారం ఆస్తి సర్వే చేసి ఎవరి పేరు మీద నమోదు చేస్తారో వారిదే స్థలం, ఇల్లు, పొలం, గట్రా. వీఆర్వో, ఆర్ఐ, తహశీల్దార్, సివిల్ కోర్టులు, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్‌ఏ, సబ్ రిజిస్ట్రార్ ఇలా ఏ ఒక్కరు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోరు.

ఈ విషయంలో చివరికి కోర్టులు కూడా ఎలాంటి జోక్యం చేసుకోదు.ఇక ఏ సమస్య అయినా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తీరుస్తారు. ఆయన తీర్పు నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లాలి. వీళ్లద్దరి తీర్పుతో సంతృప్తి చెందకపోతే నేరుగా హైకోర్టుకే వెళ్లాలి. ప్రస్తుతం ఇలాంటి విషయాలు కోర్టులో తేలుతున్నాయి అయితే ఇకపై కోర్టులో కాకుండా అధికారులు తేలుస్తారు. ఈ అధికారులు ఎంత బాగా పని చేస్తారో కళ్ల ముందే ఉంది. ఈ తీర్పు చెప్పే అధికారిగా ఏ వ్యక్తినైనా నియమించవచ్చు. మొత్తానికి ఈ చట్టం అమలు చేసి పెద్ద ఎత్తున దోపిడీలకు దందాలకు పాల్పడవచ్చని అలా చేసిన అడిగేవారు ఎవరూ లేరని ఉద్దేశంతోనే ఈ చట్టం అమలులోకి తీసుకువచ్చారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -