YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఎంత లబ్ధి పొందారనే విషయాలన్నింటిని కూడా వివరించారు అలాగే ఈ ఐదేళ్ల కాలంలో నవరత్నాల ద్వారా ఏ సామాజిక వర్గానికి చెందినవారు ఎంత లబ్ధి పొందుతారు అనే విషయాలన్నింటినీ కూడా వివరించారు.

వైయస్సార్ చేయూత పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వ్యవధిలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏడాది 18 వేల రూపాయలను వారి ఖాతాలో వేశారు అయితే గత ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈయన నాలుగో విడత డబ్బులు కూడా అక్క చెల్లెమ్మల ఖాతాలో జమ చేశానని వెల్లడించారు.

ఎలా రాష్ట్రవ్యాప్తంగా నాలుగో విడతలు భాగంగా జగన్మోహన్ రెడ్డి రూ.158.77 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే నాలుగో విడతలు భాగంగా అనకాపల్లిలో మార్చి 7 వ తేదీ బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ బటన్ నొక్కినప్పటికీ ఎవరి ఖాతాలో కూడా డబ్బు జమ కాలేదు కానీ నాలుగో విడత డబ్బులు కూడా జమ చేశామంటూ జగన్మోహన్ రెడ్డి డబ్బా కొట్టుకుంటున్నారు తప్ప డబ్బులు మాత్రమే ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాలో చేరలేదు.

కేవలం చేయూత మాత్రమే కాకుండా ఈ బీసీ నేస్తం సైతం ఎన్నికలకు ముందే బట్టలు నొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఆ లబ్ధిదారుల ఖాతాలో డబ్బును జమ చేసిన దాఖలాలు లేవు. అయితే ఇటీవల ఈ డబ్బును కూడా విడుదల చేశామంటూ జగన్ మోహన్ రెడ్డి డబ్బాలు కొట్టుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా నాలుగో విడత డబ్బులు ఎక్కడయ్యా జగన్ అంటూ ప్రశ్నిస్తున్నారు చేసేది గోరంత అయిన ప్రచారం మాత్రం కొండంత ఉందంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -