CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫెయిల్డ్ ముఖ్యమంత్రా.. హామీల అమలులో అట్టర్ ఫ్లాప్?

CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో ఏపీ అభివృద్ధిని గాలికి వదిలేసారన్నమాట వాస్తవమే. ఇలా అభివృద్ధిని పక్కనపెట్టి ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నాయకులు అధినేత పట్ల కేసులు పెట్టడం వారిని జైలుకు పంపించడం వంటి పనులలోనే ఈ ఐదు సంవత్సరాలు బిజీగా గడిపారని చెప్పాలి. ఇక తాను గత ఐదు సంవత్సరాల పాటు అద్భుతమైన పాలన కొనసాగించాలని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని గొప్పలు చెబుతున్నారు కానీ సంక్షేమ పథకాలు అందించే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.

గత ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈయన చేసిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేశారు మహిళలకు చెప్పినటువంటి హామీలన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి మరిచిపోయారు. ఇలా ఏ ఒక్క హామీ కూడా ఈయన విజయవంతంగా నెరవేర్చలేకపోయారు. దీంతో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఈయనకు వ్యతిరేకత ఏర్పడింది ఈ వ్యతిరేకత నుంచి సానుభూతి దక్కించుకోవడం కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే గులకరాయి దాడి ఒకటి. గత ఎన్నికలలో భాగంగా ఈయన గెలుపు కోసం కోడి కత్తి డ్రామా అలాగే బాబాయ్ హత్య కేసును చంద్రబాబుపై వేసి ఎలా అయితే సింపతి దక్కించుకొని గెలుపొందారో ఇప్పుడు కూడా అలాంటి సింపతి దక్కించుకోవడం కోసమే ఈ రాయి దాడి ఘటన అంటూ కొత్త డ్రామా తెరపైకి తీసుకువచ్చారు అయితే ప్రజలెవరు నమ్మే పరిస్థితిలో లేరని తెలుసుకున్నటువంటి జగన్ మేనిఫెస్టో ద్వారా ప్రజల ముందుకు వచ్చారు.

ఇక గత ఎన్నికల సమయంలో చెప్పినటువంటి మేనిఫెస్టోలోని పథకాలనే సక్రమంగా అందించ లేనటువంటి ఈయన ఈసారి మరి కొన్ని సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ముందుకు వచ్చి మేనిఫెస్టో విడుదల చేశారు అయితే ఈ మేనిఫెస్టోలో కూడా చెప్పినవి చేయడం జగన్ తరం కాదని ఇవన్నీ కూడా ప్రజలలో సానుభూతి కలిగి ఓట్లు రాబట్టుకోవడం కోసమే చేస్తున్నారని ప్రజలు పూర్తిగా నమ్మారు కనుక జగన్మోహన్ రెడ్డిని ఒక ఫెయిల్ అయిన ముఖ్యమంత్రిగా పరిగణిస్తూ ఆయనకు 10 శాతం కూడా మార్కులు వేయలేకపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పూర్తి వ్యతిరేకత సంపాదించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలలో ఓటమి చెందడం ఖాయమని ప్రజా తీర్పు ఎన్నికలకు ముందే తెలియచేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -