Actor Manobala: గజిని, ఊపిరి నటుడు కన్నుమూత.. ఆ ఆరోగ్య సమస్యలతో?

Actor Manobala: ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా ఒక నటుడు మరణం తర్వాత మరొకరు మరణించడంతో ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తమిళ నటుడు కమెడియన్ మనోబాల తాజాగా కన్నుమూశారు. ఈయన ఎన్నో తెలుగు తమిళ సినిమాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను తన కామెడీతో ఆకట్టుకున్నారు.ఇలా కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎన్నో సినిమాలలో నటించిన ఈయన నేడు తుది విశ్వాస విడిచారు.

కమెడియన్ మనోబాల గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలోనే సినిమాలకు కూడా దూరమయ్యారు. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈయన కొద్దిసేపటి క్రితం మరణించారు. ఇలా కమెడియన్ మనోభాల మరణ వార్త తెలియగానే పలువురు తెలుగు తమిళ సెలబ్రిటీలు ఈయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

 

ఇక ఈయన గజిని, ఊపిరి,వంటి ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించారు. అయితే ఈయన మరణ వార్త ఇండస్ట్రీని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.ఇక ఈయన మరణ వార్త తెలిసినటువంటి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయన మృతికి సంతాపం తెలియజేస్తూ ఈయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -