Camel Milk: దేవుడా.. ఒంటె పాలు తాగితే ఏకంగా ఇన్ని ప్రయోజనాలా?

Camel Milk: ఎడారి ప్రాంతాలలో ఎక్కువగా సంచరించే ఒంటెలు వల్ల కేవలం ప్రయాణానికి మాత్రమే కాకుండా వీటి ద్వారా వచ్చే పాలు కూడా మనకు ఎంతో ఆరోగ్యానికి ప్రయోజనకరమని తెలుస్తోంది. సాధారణంగా ఒంటెలు అన్ని ప్రాంతాలలో కన్నా ఎడారిలోనే ఎక్కువగా ఉంటాయి.ఎడారి ప్రాంతాలలో ప్రయాణించడానికి ఇవే సులువైన మార్గంగా ఉపయోగిస్తూ ఉంటారు అయితే అక్కడ నివసించే వారందరూ కూడా ఒంటె పాలను తాగుతూ ఉంటారు.

ఒంటె పాలను తాగటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. ఈ పాలలో లాక్టోఫెర్రిన్ అనే మూలకం ఉంటుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడటానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ పాలలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. ఒంటె పాలు ఆవు పాల కంటే తేలికైనవి. మిల్క్ షుగర్, ప్రొటీన్, కాల్షియం, కార్బోహైడ్రేట్, షుగర్, ఫైబర్, లాక్టిక్ యాసిడ్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఎ వంటి అనేక మూలకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి.

 

మార్కెట్లో ఒంటె పాలకు చాలా డిమాండ్ ఉంది ఈ పాలు లీటర్ ధర సుమారు 150 రూపాయల నుంచి 200 వరకు ధర పలుకుతుంది. ఇక కొత్తగా పెళ్లయిన వారు కూడా ఈ ఒంటె పాలను ఎక్కువగా తాగుతున్నారని తెలుస్తుంది. కొత్తగా పెళ్లయిన వారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈ పాలు ఎంతో దోహదపడతాయి అందుకే ఎక్కువగా కొత్తగా పెళ్లయిన వారు ఒంటె పాలను తాకడానికి ఆసక్తి చూపుతున్నారట.

 

ఇందులో మధుమేహం, కొలెస్ట్రాల్, బిపి, రక్తహీనత, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ఆర్థరైటిస్ లేదా ఆర్థరైటిస్ మొదలైన వ్యాధులను నయం చేయడంలో ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 600 మిలియన్ టన్నుల ఆవు పాలు ఉత్పత్తి అవుతాయి. ఇందులో ప్రతి సంవత్సరం 3 మిలియన్ టన్నుల ఒంటె పాలు మాత్రమే ఉత్పత్తి కావటం వల్ల మార్కెట్లో ఈ పాలకు భారీగా డిమాండ్ ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -