Bellamkonda Chhatrapati: దేవుడా.. బెల్లంకొండ ఛత్రపతి కలెక్షన్లు తెలిస్తే దండం పెట్టాల్సిందే!

Bellamkonda Chhatrapati: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు. ఇక తెలుగులో అల్లుడు శీను, జయ జానకి నాయక, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్, సాక్ష్యం, స్పీడున్నోడు లాంటి సినిమాలలో నటించి మెప్పించాడు బెల్లంకొండ శ్రీనివాస్. మొదటి సినిమా అల్లుడు శీను సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.

కాగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమాలు అన్నీ కూడా హిందీలో డబ్బింగ్ అయ్యాయి. దాంతో బాలీవుడ్ లో కూడా బెల్లంకొండ శ్రీనివాస్ కు భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. దాంతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది అనుకున్నా బెల్లంకొండ శ్రీనివాస్ ఏకంగా ఈసారి డైరెక్ట్ గా హిందీలో ఒక తెలుగు సినిమా అనేది చేశాడు. టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లోకి రీమేక్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమాతో హిందీలోకి అడుగు పెట్టాడు. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాలు పెట్టుకున్న శ్రీనివాస్ కి ఈ సినిమా దారుణమైన రిజల్ట్ ని మిగిల్చింది.

 

బాలీవుడ్ లో ఎక్కడ ఒక్క షో కూడా ఫుల్ అవ్వలేదు. ఓపెనింగ్స్ నిల్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెంట్ డబ్బులు రాకపోగా తిరిగి కట్టాల్సి వస్తుంది. డే వన్ జీరో షేర్ అనే మీమ్స్, ట్రోల్స్ నడుస్తున్నాయి. మొత్తానికి చాలా ఆశలతో బాలీవుడ్ అడుగు పెట్టిన శ్రీనివాస్ కి ఛత్రపతి రిజల్ట్ పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో ప్రమోషన్స్ సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన చేసిన కామెంట్స్ ని వైరల్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి ముఖ్యంగా ప్రేక్షకులకు దగ్గర అవ్వాలంటే బాలీవుడ్ సినిమాలలో నటించాల్సిందే అన్న మాటను ఇక వైరల్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -