Payment Apps Block: స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నారా.. పేమెంట్స్ యాప్స్ ను సులువుగా ఎలా బ్లాక్ చేయాలంటే?

Payment Apps Block: సాధారణంగా కొన్నిసార్లు మనం మన పనులలో నిమగ్నం అవ్వడం వల్ల మన సెల్ ఫోన్ పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది.ఇలా సెల్ఫోన్ పోవటం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క లావాదేవీలు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మన అకౌంట్ కి సంబంధించిన అన్ని వివరాలు కూడా సెల్ఫోన్లో ఉంటాయి. ఇలాంటి సమయంలోనే ఈ పేమెంట్స్ యాప్ ఉండటంవల్ల ఫోన్ పోవడంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.

ఇలా ఫోన్ పోయిన మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు సేఫ్ గా ఉండాలి అంటే వెంటనే పేమెంట్స్ యాప్ బ్లాక్ చేయాల్సి ఉంటుంది. మరి మన ఫోన్లో ఉన్నటువంటి ఫోన్ పే గూగుల్ పే వంటి వాటిని ఫోన్ పోతే ఎలా బ్లాక్ చేయాలి అనే విషయానికి వస్తే… ఫోన్ పోయినప్పుడు గూగుల్ పే అకౌంట్ వాడేవారు వెంటనే 1800 419 0157 అనే నంబర్ కాల్ చేసి వారు అడిగే వివరాలన్నింటినీ తెలియజేస్తే మన అకౌంట్ బ్లాక్ చేస్తారు.

 

పేటీఎం అకౌంట్ బ్లాక్ చేయాలి అంటే 012044 56456 నంబర్ కి కాల్ చేసి రిపోర్ట్ లాస్ట్ ఆర్ అన్ ఆథరైజ్డ్ యూసేజ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత లాస్ట్ ఫోన్ అనే ఆప్షన్ ఎంచుకొని మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. దీంతో మీ పేటీఎం అకౌంట్ బ్లాక్ అవుతుంది. ఇక ఫోన్ పే ఉపయోగించేవారు ఫోన్ పే అకౌంట్ బ్లాక్ చేయాలి అంటే08068 727374 లేదా02268 727374 నెంబర్ కు కాల్ చేసి మీ వివరాలు తెలిపితే ఈ అకౌంట్ బ్లాక్ అవుతుంది.

 

ఇలా మీ డిజిటల్ పేమెంట్స్ యాప్ బ్లాక్ చేయడానికి కన్నా ముందుగా మీ మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్ తో మాట్లాడి బ్లాక్ చేయించాలి దీని ద్వారా ట్రాన్సాక్షన్ కు సంబంధించిన కీలకమైన ఓటీపీలు రావడం కూడా నిలిచిపోతాయి. ఫోన్ పోయిన వెంటనే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -