Datura Leaf Oil: ఈ ఆకు రసం మోకాళ్లపై రాస్తే క్షణాల్లో మోకాళ్ల నొప్పులు మాయం.. ఏం చేయాలంటే?

Datura Leaf Oil: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది మోకాలి నొప్పులతో బాధపడటం మనం చూస్తూనే ఉంటాము. గత కాలంలో వయసు పైబడిన వారికి మాత్రమే మోకాలి నొప్పులు వచ్చేవి. కానీ నేటి జీవన విధానం వలన, ఆహారంలో మార్పుల వలన చిన్న వయసులో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. స్థూలకాయం కూడా మోకాళ్ళ నొప్పులకు ఒక కారణం. అయితే ఈ నొప్పి టాబ్లెట్లు వేసుకున్నప్పటికీ సరియైన ఉపశమనం కనిపించదు.

అయితే మోకాలు నొప్పికి ఆయుర్వేదంలో ఒక మంచి ఔషధం ఉంది. అదే మోకాళ్ళ నొప్పులు తగ్గించే కనక లేపం. దీనిని ఉమ్మెత్త ఆకులతో చేస్తారు. ఉమ్మెత్త ఆకులని సంస్కృతంలో కనక అని అంటారు. ముందుగా ఉమ్మెత్త ఆకులని తీసుకొని వాటిని గ్రైండ్ చేసి రసాన్ని బయటికి తీయండి. ఆ రసం ఎంత క్వాంటిటీ వచ్చిందో చూసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టండి.

ఆ రసం మరుగుతూ ఉండగా అంతే క్వాంటిటీ బెల్లం తీసుకొని అందులో వేసి బాగా కలుపుతూ ఉండండి. ఆ లేపం బాగా మరిగి దగ్గర పడుతుంది. చివరికి ఒక పేస్టులాగా తయారవుతుంది. ఆ పేస్ట్ ని మోకాలి నొప్పిపై లేపనం లాగా పూస్తే ఎంతటి వాపు అయినా నొప్పి అయినా వెంటనే తగ్గుముఖం పడుతుంది. మోకాలి పై ఆ లేపనాన్ని రెండు గంటల వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత వేడి నీటితో కడిగి శుభ్రపరచుకోవాలి.

అలాగే ఈ లేపనాన్ని సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు. వాడిన ప్రతిసారి కొంచెం వేడి చేసి అప్పుడు పై పూతగా పూయండి. ఇలా చేస్తే ఎలాంటి మోకాలు నొప్పులు అయినా తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ ఆకులని వేయించి ఒక మూటలాగా కట్టి కొంచెం వేడి చల్లారిన తరువాత మోకాలి నొప్పులు మీద వాపుల మీద కాపడం లాగా పెడితే మంచి ఉపశమనం లభిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: చంద్రబాబు స్టామినాకు ఫిదా అవ్వాల్సిందే.. ఏడు పదుల వయస్సులో చెలరేగిపోతున్నారుగా!

Nara Chandrababu Naidu:  ఏపీలో ఎన్నికలవేళ పార్టీ ప్రచారాల జోరు ఊపందుకున్న నేపథ్యంలో అందరి దృష్టి చంద్రబాబు నాయుడు మీద పడటం గమనార్హం. చంద్రబాబు నాయుడు లో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.....
- Advertisement -
- Advertisement -