Lemon Coffee: కాఫీని ఇలా తాగితే కొవ్వు మొత్తం సులువుగా కరుగుతుందా.. పాటించాల్సిన చిట్కాలు ఇవే!

Lemon Coffee: మామూలుగా చాలామందికి ఉదయం లేవగానే కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. ఒకరోజు కాఫీలు టీలు తాగాకపోయినా కూడా ఆ రోజంతా కూడా ఏదోలా ఫీలవుతూ ఉంటారు. అయితే కాఫీ టీలతో పాటు ఎక్కువమంది తాగే వారిలో లెమన్ కాఫీ కూడా ఒకటి. ఈ లెమన్ కాఫీ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని తాగడం వల్ల ఎన్నో రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. లెమన్ కాఫీ తో తలనొప్పి, విరోచనాలు మొదలైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎక్కువగా నిమ్మకాయని మనం వాడుతూ ఉంటాము.

నిమ్మకాయ, కాఫీ పొడి రెండూ కూడా మన వంటగదిలో దొరికేవి. ఈ రెండు కలిపి తీసుకుంటే, చాలా రకాల సమస్యలకి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో కొవ్వుని కరిగించడానికి కూడా నిమ్మ, కాఫీ బాగా ఉపయోగపడతాయి. కాఫీలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే, ఆకలి బాగా అవుతుంది. జీవక్రియ వేగవంతం అవుతుంది. కొవ్వుని కరిగించడానికి కూడా ఇది సహాయం చేస్తుంది. శరీరంలోని కొవ్వును తగ్గించడం అంత ఈజీ కాదు. కానీ కాఫీ, నిమ్మరసం కలిపి తీసుకోవడం వలన కొవ్వు బాగా తగ్గుతుంది. బరువు తగ్గడానికి కూడా ఇవి రెండు బాగా ఉపయోగపడతాయి. కాఫీలో ఉండే కెఫిన్, శరీరం జీవక్రియని వేగవంతం చేస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థని ప్రేరేపిస్తుంది.

మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. లెమన్ కాఫీ ని తీసుకోవడం వలన, ఉదర సంబంధిత సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చు. క్యాలరీలను తగ్గిస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ వల్లన కలిగే నష్టాన్ని తొలగించగలవు. రాత్రిపూట తీసుకుంటే, మంచి నిద్రని పొందొచ్చు. మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. తలనొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. డయేరియా వంటి సమస్యలు కూడా ఉండవు. అతిసారం తో బాధపడుతున్నప్పుడు, ఈ కాఫీ ని తీసుకుంటే చక్కటి బెనిఫిట్ ఉంటుంది. కాఫీలో నిమ్మరసం కలుపుకొని తీసుకోవడం వలన ఇలా మంచి మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -