Red Amaranth: ఎర్ర తోటకూర వల్ల కలిగే ఈ లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చా?

Red Amaranth: కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే బయట ఫుడ్డు తినడాన్ని కాస్త తగ్గించి ఇంట్లోనే ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తయారు చేసుకొని తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఆకుకూరలు కూరగాయలు వారి ఆహారంలో ఉండేలాగా చూసుకుంటున్నారు.

ఈ విధంగా ఆకుకూరలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అనే విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా ఈ ఆకుకూరలలో ఎర్ర తోటకూర తినడం ఎంతో మంచిది. చాలామంది ఈ తోటకూరను తినడానికి ఇష్టపడరు కానీ ఇందులో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే కనుక ప్రతిరోజు తోటకూరను మీ ఆహారంలో భాగంగా చేర్చుకుంటారు. మరి ఎర్ర తోటకూరను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…

ఎర్ర తోటకూరలో ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉన్నాయి విటమిన్లు, పొటాషియం ఐరన్ క్యాల్షియం వంటి పోషక విలువలు ఎర్ర తోటకూరలు పుష్కలంగా లభిస్తాయి. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు ఎర్ర తోటకూరను తీసుకుంటే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుంది. ఎర్ర తోటకూర తినటం వల్ల ప్రేగు కదలికలు కూడా బాగా ఉంటాయి ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలను కూడా తొలగిస్తుంది.

ఇక ఈ తోటకూరల్లో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకల దృఢత్వానికి దంతాలు బలంగా తయారవడానికి ఎంతో దోహదపడుతుంది. సీజనల్ గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ ని కూడా తగ్గిస్తుంది. వాటితో ఇది పోరాడుతుంది. గొంతు క్యాన్సర్ రాకుండా ఎర్ర తోటకూర సహాయం చేస్తుంది. ఇక రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండెపోటు సమస్యలను కూడా నివారిస్తుంది. చాలామంది చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోవడం వల్ల అధిక శరీర బరువుతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యతో బాధపడే వారికి ఎర్ర తోటకూర అధికంగా తీసుకోవడం వల్ల ఇది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని కరిగిస్తూ ఈ సమస్య నుంచి బయట పడేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -